Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..

Harnaaz Sandhu: హర్నాజ్ సంధూ.. ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటున్న పేరు. మిస్ యూనివర్స్ టైటిల్ సొంతం చేసుకోవడంతో అమె ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మరి అమె గురించి ఆసక్తికర వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 01:01 PM IST
  • 21 ఏళ్ల తర్వాత భారత్​కు మిస్​ యూనివర్స్ టైటిల్​
  • కల నిజం చేసిన పంజాబీ యువతి హర్నాజ్​ సంధూ
  • 17 ఏళ్లకే కెరీర్​ ప్రారంభించి.. వరుస విజయాలు
Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..

Miss Universe 2021 Harnaaz Kaur Sandhu: ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్​ యూనివర్స్​-2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ (Harnaaz Sandhu Win Miss Universe title) కిరీటాన్ని దక్కించుకుంది. దీనితో భారత్​కు.. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

1994లో సుస్మితా సేన్​, ఆ తర్వాత 2000 సంవత్సరంలో లారా దత్త చివరిసారిగా మిస్​ యనివర్స్ కిరాటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హర్నాజ్ సంధూ.. మిస్​ యూనివర్స్​గా (Miss Universe title to India) నిలిచింది.

ఇంతకి ఎవరు ఈ హర్నాజ్ సంధూ? అమె నేపథ్యం ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హర్నాజ్​ సంధూ 2000 సంవత్సరంలో (Harnaaz Sandhu Birth year) చండీగఢ్​లో జన్మించింది. అమె పూర్తి పేరు హర్నాజ్ కౌర్ సంధూ. హర్నాజ్​ సంధూ తల్లి అమృత​ కౌర్​ సంధూ, తండ్రి గురుచరణ్​ సింగ్​ సంధూ.

మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభం..

17 ఏళ్ల వయసులో మోడలింగ్​ కెరీర్​ ప్రారంభించింది. అదే ఏడాది మిస్ చంఢీగడ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్​ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా-2018 టైటిల్​ను అందుకుంది. 2019లో మిస్​ ఇండియా పంజాబ్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఈ ఏడాదే బాలీవుడ్ నటి కృతి సనన్​ చేతుల మీదుగా మిస్​ దివా యూనివర్స్ ఇండియా కిరిటాన్ని ధరించింది హర్నాజ్ సంధూ.

ఇక తాజాగా 70వ మిస్​ యూనివర్స్ కిరీటాన్ని (Miss Universe 2021) అందుకుని అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది.

హర్నాజ్​ నటి కూడా..

హర్నాజ్ సంధూ నటి కూడా. పలు పంజాబ్​ సినిమాల్లో, వీడియో ఆల్బమ్స్​లో అమె నటించిది. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే సినిమాల్లో హీరోయిన్​గా చేసింది. హర్నాజ్​ సంధూ నటించిన పలు వీడియో ఆల్బమ్​లు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

యాక్టింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం అంటే హర్నాజ్​కు చాలా ఇష్టం. ఫిట్​గా ఉండేందుకు నిత్యం యోగా చేస్తుంటుంది హర్నాజ్​.

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌ను సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..

Also read: Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News