Prashanth Neel: ప్రభాస్ అభిమానులకి ప్రశాంత్ నీల్ సర్ప్రైజ్.. ఐటమ్ సాంగ్ తో రచ్చ..

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సలార్. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా లో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ని కూడా జత చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 10:55 AM IST
Prashanth Neel: ప్రభాస్ అభిమానులకి ప్రశాంత్ నీల్ సర్ప్రైజ్.. ఐటమ్ సాంగ్ తో రచ్చ..

Salaar : బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరియర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా పడలేదు. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా ఇప్పుడు అభిమానులు అందరూ ప్రభాస్ తదుపరి సినిమా సలార్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

కే జి ఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ప్రేక్షకులకి కూడా బాగా నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రంతో తమ అభిమాన హీరో ప్రభాస్ బ్లాక్ బస్టర్ అందుకుంటారని విపరీతమైన నమ్మకం పెట్టుకో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28 న థియేటర్ లలో విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ని డిసెంబర్ 22 కి వాయిదా వేశారు.

తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీ షూట్ చేయడంతో పాటు చిత్ర బృందం సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ని కూడా జత చేసిందట. అందుకే సినిమాని సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. త్వరలో ఈ పాటకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ బయటకు రానున్నాయి. మరోవైపు సినిమా విడుదల తేది కూడా దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ లని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ బయటకు రాబోతున్నట్లు సమాచారం.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి, మధు గురుస్వామి, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ పతాకం పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బశ్రుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News