KGF Chapter 2: ఏడవరోజు కూడా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2: కేజీఎఫ్ 2 కురిపిస్తున్న కలెక్షన్ల వర్షం ఆగడం లేదు. వరుసగా ఏడవరోజు కూడా భారీగా వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద డబ్బులే డబ్బులు వచ్చి పడుతున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2022, 12:45 PM IST
 KGF Chapter 2: ఏడవరోజు కూడా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2

KGF Chapter 2: కేజీఎఫ్ 2 కురిపిస్తున్న కలెక్షన్ల వర్షం ఆగడం లేదు. వరుసగా ఏడవరోజు కూడా భారీగా వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద డబ్బులే డబ్బులు వచ్చి పడుతున్నాయి. 

కన్నడ స్టార్ యశ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా సూపర్ డూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. వరుసగా ఏడవరోజు కూడా భారీగా కలెక్షన్లు చేస్తోంది. సినిమా ఫస్ట్ డే టాక్ కారణంగా ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలై కేవలం వారం రోజులవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్-2..5 వందల కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. 

తొలిరోజు ఈ సినిమా 116 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు 90 కోట్లు, మూడవ రోజు 81 కోట్లు, నాలుగోరోజు 91.7 కోట్లు, ఐదవ రోజు 25.57 కోట్లు, ఆరవ రోజు 19.52 కోట్లు వసూలు చేయగా, ఏడవరోజు 33 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 హిందీ వెర్షన్ కూడా అద్భుతంగా కలెక్షన్లు చేస్తోంది. తొలి వారాంతంలో ఈ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే 193 కోట్ల 99 లక్షలు వసూలు చేసింది. బాహుబలి 2 హిందీ వెర్షన్ రికార్డును కేజీఎఫ్ 2 ధ్వంసం చేసింది. బాహుబలి 2 హిందీ వెర్షన్ తొలి వారం రోజుల్లో 2 వందల కోట్లు వసూలు చేయగా..కేజీఎఫ్ 2..ఐదవరోజే రికార్డు సాధించేసింది.

కేజీఫ్ ఛాప్టర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. దక్షిణాది నటుడు యశ్, హిందీ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిల నటన సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఇక యాక్షన్ సినిమాకు తెరకెక్కించడంలో ప్రశాంత నీల్ దర్శకత్వ ప్రతిభను అందరూ కీర్తిస్తున్నారు.

Also read: Naga Chaitanya Marriage: అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి మంత్రాలు, నాగ్ చైత్యనకు రెండో పెళ్లి\

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News