Mammootty Mother : ఇండస్ట్రీలో విషాదం.. 'మెగాస్టార్'కి మాతృ వియోగం

Mammootty Mother Death కేరళ మెగాస్టార్ మమ్ముట్టికి మాతృ వియోగం కలిగింది. ఫాతిమా (93) వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ ఉన్న ఫాతిమా నేడు కన్నుమూశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 11:48 AM IST
  • మాలీవుడ్‌లో విషాదం
  • కేరళ మెగాస్టార్‌కి మాతృ వియోగం
  • మమ్ముట్టి తల్లి కన్నుమూత
Mammootty Mother : ఇండస్ట్రీలో విషాదం.. 'మెగాస్టార్'కి మాతృ వియోగం

Mammootty Mother Death కేరళ మెగాస్టార్ మమ్ముట్టికి మాతృవియోగం కలిగింది. మమ్ముట్టి మాతృమూర్తి ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలు, వయో భారంతో గత కొన్ని రోజులుగా ఆమెను హాస్పిటల్‌లో చేర్పించగా.. నేడు ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖలంతా కూడా మమ్ముట్టికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

కొచ్చిలోని చెంబు ప్రాంతానికి చెందిన ఫాతిమా తన సోదరసోదరిమణులతో కలిసి నివసిస్తుంటారు. ఆమె అంతిమ సంస్కారాలను చెంబులోని మసీదులోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇన్ని రోజులు ఆమె మమ్ముట్టితోనే ఉండేవారని సమాచారం. ఇక తల్లి మరణంతో మమ్ముట్టి కుంగిపోయాడు. ఆయనకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెంతో మంది సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

మమ్ముట్టి వచ్చే వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అఖిల్ ఏజెంట్ మూవీలో మమ్ముట్టి స్పెషల్ రోల్‌ను పోషించిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి కీ రోల్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక వచ్చే వారం ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఇక మమ్ముట్టి బజూక అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News