Keerthy Suresh: త్వరలో పెళ్లి వార్త.. అంతా బయటపెట్టేసిన కీర్తి

Keerthy Suresh Mariage:  మలయాళంలో గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ తెలుగులో నేను లోకల్ అనే సినిమాతో హీరోయిన్  గా లాంఛ్ అయి స్టార్ అయిపొయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 3, 2023, 08:30 PM IST
Keerthy Suresh: త్వరలో పెళ్లి వార్త.. అంతా బయటపెట్టేసిన కీర్తి

Keerthy Suresh Mariage details: మలయాళంలో గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ తెలుగులో మాత్రం నేను లోకల్ అనే సినిమాతో హీరోయిన్  గా లాంఛ్ అయింది. నాని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కి వరుస అవకాశాలు దక్కాయి. అయితే ఈ భామ కెరియర్ మొదట్లోనే చేసిన మహానటి సినిమా ఆమెకు మంచి గ్రేస్ తీసుకొచ్చింది.

దాదాపుగా తెలుగు వారందరికీ ఆమె పరిచయమైపోయింది అయితే దురదృష్టమో కాదో తెలియదు కానీ ఆ తర్వాత ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే అయ్యాయి. దాదాపుగా అలాంటి సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలుస్తూ వచ్చాయి. అయితే సర్కారు వారి పాట సినిమా నుంచి మళ్లీ హిట్స్ అందుకోవడం మొదలుపెట్టిన ఈ భామకు ఇప్పుడు అవకాశాలు కరువు అవుతున్నాయి.

Also Read: Chiranjeevi Cancer: చిరుకి క్యాన్సర్ అంటూ ప్రచారం.. అవాకులు  చవాకులు  రాయకండంటూ క్లారిటీ!

ప్రస్తుతానికి కీర్తి సురేష్... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న  భోళా శంకర్ సినిమాలో ఆయన సోదరి పాత్రలో కనిపిస్తోంది. అయితే కీర్తి సురేష్ వివాహానికి సిద్ధమైందని ఫలానా వ్యక్తితో జరగబోతోంది అంటూ రకరకాల పెళ్లి వార్తలు వచ్చాయి. ఆమె పెళ్లి గురించి అధికారికి సమాచారం ఉంటే వెల్లడిస్తామని ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఒక తమిళ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి స్పందించింది.

తన పెళ్లి గురించి ప్రశ్నలు సంధిస్తూ ఉండడంతో ఇక స్పందించకుండా ఉండడం కరెక్ట్ కాదని భావించి ఆమె క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి గురించి అనేక వార్తలు తెరమీదకి వస్తున్నాయి. అందుకే వాటన్నింటికీ క్లారిటీ వచ్చేలా నేను త్వరలోనే అధికారికంగా నా పెళ్లి గురించి వెల్లడిస్తాను నిజానికి నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు అంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాక మీడియాని తన పెళ్లి గురించి రకరకాల వార్తలు వద్దు అని ఆమె కోరింది.

Also Read: Raashii Khanna: సీక్రెట్ టెంప్టేషన్ అంటూ ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

 

Trending News