Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల

మహానటితో హీరోయిన్ గా మరోఎత్తు ఎదిగిన నటి కీర్తి సురేష్. ప్రస్తుతం మహేష్ బాబు ( Mahesh Babu ) మూవీ సర్కారు వారి పాటలో కథానాయికగా నటిస్తోంది. 

Last Updated : Oct 24, 2020, 03:42 PM IST
    • మహానటితో హీరోయిన్ గా మరోఎత్తు ఎదిగిన నటి కీర్తి సురేష్.
    • ప్రస్తుతం మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాటలో కథానాయికగా నటిస్తోంది.
    • దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది కీర్తి సురేష్.
Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల

మహానటితో హీరోయిన్ గా మరోఎత్తు ఎదిగిన నటి కీర్తి సురేష్. ప్రస్తుతం మహేష్ బాబు ( Mahesh Babu ) మూవీ సర్కారు వారి పాటలో కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది కీర్తి సురేష్. అందులో ఒకటి మిస్ ఇండియా ( Miss India Movie ). ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మేరకు కీర్తి సురేష్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి సమాచారం అందించింది.

Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 

ట్రైలర్ రివ్యూ..
ఎంబీఏ పూర్తి చేసిన ఒక అమ్మాయి వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనుకుంటుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉద్యోగమే చేయాలంటారు. కానీ బలమైన ఆమె కోరిక ముందు బలవంతంగా ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యుల ఆశలు ఫలించవు. దాంతో ఆ అమ్మాయి వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తుంది.

మిస్ ఇండియాలో జగపతిబాబు నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ఎదుగుదలకు అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వ్యాపారం అంటే ఆడపిల్ల ఆడుకునే వస్తువు కాదు.. అది ఒక వార్ అంటాడు. దానికి బిజినెస్ తన బ్లడ్ లో ఉంది అని గెలవడానికి ఏమైనా చేస్తానని కీర్తి సురేష్ ఎదురు సమాధానం ఇస్తుంది. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

READ ALSO | Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News