Keerthy Suresh : ఓరి పాపాత్ముల్లారా.. వింత చర్యలకు కీర్తి సురేష్ రియాక్షన్

Keerthy Suresh Fans కీర్తి సురేష్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆమె నిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఆమె తాజాగా వేసిన పోస్ట్ చూసి జనాలు నవ్వేసుకుంటున్నారు. తన అభిమానులో ఎవరో చేసిన ఈ పనికి కీర్తి సురేష్ సైతం నవ్వుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 07:53 PM IST
  • కీర్తి సురేష్‌ అభిమానుల హంగామా
  • ఫ్లెక్సీని చూసి నవ్వుకున్న కీర్తి సురేష్‌
  • ఓరి పాపాత్ముల్లారా అంటూ కామెంట్
Keerthy Suresh : ఓరి పాపాత్ముల్లారా.. వింత చర్యలకు కీర్తి సురేష్ రియాక్షన్

Keerthy Suresh Fans మహానటి సినిమాతో జనాల్లోకి మహానటిగా నిలిచిపోయింది కీర్తి సురేష్. అయితే మళ్లీ మహానటి రేంజ్‌లో పర్ఫామెన్స్ చేసే సినిమాలు కీర్తి ఖాతాలో పడలేదు. మధ్యలో చిన్ని అనే సినిమాతో అందరినీ మెప్పించింది. అయితే దసరా సినిమాలో మాత్రం తనలోని ఇంకో యాంగిల్‌ను చూపించింది కీర్తి సురేష్. ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్‌ అందరినీ కట్టి పడేసింది.

కీర్తి సురేష్‌ మామూలుగానే సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌తో కలిసి చిట్ చాట్ చేస్తుంటుంది. తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. ఇక సెట్స్‌లో ఎంత అల్లరి చేస్తుంటుందో ఇది వరకే చూశాం. దసరా సెట్లో అయితే కీర్తి సురేష్ అల్లరి చేసిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ కూడా కీర్తి అల్లరి గురించి చెబుతూనే వచ్చారు.

Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్కొక్కరు ఎలా తమ ప్రతిభను చూపిస్తున్నారు.. టాలెంట్‌తో మతులు పొగొడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా కీర్తి సురేష్‌ తన అభిమాని పంపిన ఓ పోస్ట్‌ను చూసింది. దాన్ని చూసుకుని తెగ నవ్వుకుంది. మామూలుగా ఎవరో కీర్తి సురేష్‌ ఫోటోను భారీ ప్లెక్సీగా వేయించుకున్నట్టుగా ఉంది. అయితే ఆ ఫోటోను ఒకరు తెలివిగా కీర్తి సురేష్‌కు చేయి విరిగినట్టు, పట్టీ కట్టుకున్నట్టుగా పెయింట్ వేశాడు.

చేయి విరిగిందా? కట్టుకట్టాలా? వంటి యాడ్స్‌కు ఇలా వాడుకోవచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ చేసి పెట్టాడు ఓ అభిమాని. ఇక తన చేయి విరిగినట్టు, అలా పట్టీ కట్టుకున్నట్టుగా ఉండటం చూసి కీర్తి సురేష్ నవ్వుకుంది. ఓరి పాపాత్ముల్లారా ఇలా చేశారేంట్రా అన్నట్టుగా రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ ఫన్నీ పోస్ట్ నెట్టింట్లో అందరినీ నవ్విస్తోంది.

Also Read:  Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News