Keerthy Suresh: కీర్తిసురేష్‌కు షాకింగ్ అనుభవం.. కారులో ఉండగా ఆ పని చేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్..

Keerthy Suresh got angry: నటి కీర్తి సురేష్ ఇటీవల సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు కొంత మంది ఆమె చుట్టు కూడా చేరి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 4, 2025, 07:49 PM IST
  • ఆవేశంతో ఊగిపోయిన కీర్తిసురేష్..
  • కారులో ఉండగా ఆపని..
 Keerthy Suresh: కీర్తిసురేష్‌కు షాకింగ్ అనుభవం.. కారులో ఉండగా ఆ పని చేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్..

keerthy suresh angry on photographer video goes viral: కీర్తిసురేష్ పెళ్లి తర్వాత తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమె తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టీల్ ను గోవాలో పెళ్లి చేసుకున్నారు. హిందు, క్రిస్టియన్ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మహానటి బేబీ జాన్ మూవీ ప్రమోషన్ల లో పాల్గొన్నారు. బాలీవుడ్ లో బేబీజాన్తో తొలిసారి కీర్తిసురేష్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తొంది.

అయితే.. ఈ మూవీకిగాను.. సమంత.. కీర్తిసురేష్ పేరును సజ్జస్ట్ చేసినట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో నటి కీర్తిసురేష్ ఎక్కడకు వెళ్లిన కూడా పసుపు మంగళ సూత్రం ధరించి ప్రమోషన్ లలో పాల్గొన్నారు. అయితే.. తాజాగా.. నటి కీర్తిసురేష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తొంది. ఆమె తన మూవీ ప్రమోషన్ లో భాగంగా అనేక ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అదే విధంగా చివరకు తన కారులో వెళ్లిపోయేందుకు రెడీ అయిపోయారు.

 

ఆ సమయంలో ఒక ఫోటో గ్రాపర్.. కీర్తిసురేష్ వంగి.. కారులో ఎక్కేటప్పుడు.. బ్యాడ్ యాంగిల్ లో ఫోటోలు తీసినట్లు తెలుస్తొంది. దీనిపై ఆమె సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై కీర్తి సురేష్ సైతం... కారులో కూర్చుని తీవ్ర అసహానం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.

Read more: Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..

ఇలాగా బ్యాడ్ యాంగిల్ లో ఫోటోలు తీయడం ఏంటని కూడా ఆమె ఫైర్ అయ్యారంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది కీర్తిసురేష్ కు సపోర్ట్ గా కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. నీ డ్రెస్సింగ్ ఎలా ఉందో ఒకసారి చూసుకొ..అంటూ కూడా ఆమెకు కౌంటర్ లు వేస్తున్నారంట. మొత్తానికి కీర్తిసురేష్ మాత్రం  ఈ ఘటనలో ట్రెండింగ్ గా మారినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News