Vicky Kaushal Filmfare Award: ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న విక్కీ కౌశల్ కు కత్రినా ముద్దుల వర్షం

Katrina Kaif Kisses Vicky Kaushal at Filmfare Awards 2022: ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న భర్తకు కత్రినా కైఫ్ ముద్దిచ్చి ఆశ్చర్యపరిచింది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2022, 03:12 PM IST
Vicky Kaushal Filmfare Award: ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న విక్కీ కౌశల్ కు కత్రినా ముద్దుల వర్షం

Katrina Kaif Kisses Vicky Kaushal at Filmfare Awards 2022: బాలీవుడ్ 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ ఫిలింఫేర్ అవార్డుల విషయానికి వస్తే బాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ నిలిచారు. స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 83 సినిమాలో నటించిన నటనకు గాను రణవీర్ సింగ్ కి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నటిగా మీమీ సినిమాకి గాను కృతి సనన్ ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

ఇక ఫిలింఫేర్ అవార్డు తీసుకునే సమయంలో తన భార్య బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కలిసి రణవీర్ సింగ్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. మరోపక్క విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ మొదటిసారిగా జంటగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల రెడ్ కార్పెట్‌ మీద సందడి చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) టైటిల్‌ను గెలుచుకున్న విక్కీ కౌశల్, కత్రినా హిట్ సాంగ్ కాలా చష్మాను హమ్ చేస్తూ కనిపించాడు. ఇది మాత్రమే కాదు, విక్కీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు, కత్రినా అతన్ని బహిరంగంగా ముద్దు పెట్టుకుంది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కోసం విక్కీ కౌశల్ భార్య కత్రినాతో కలిసి బ్లాక్ సూట్‌లో సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్ కోసం కత్రినా షీర్ లుక్ చీరను సలెక్ట్ చేసుకుంది. ఈ షో మొత్తం మీద ఈ స్టార్ కపుల్ లుక్ చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022లో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో విక్కీ కౌశల్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. సర్దార్ ఉదమ్‌సింగ్‌లో ఉత్తమ నటనకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. విక్కీ తన అవార్డు ట్రోఫీతో తన సీటుకు తిరిగి వచ్చిన వెంటనే, కత్రినా తన బుగ్గలపై ముద్దు పెట్టి విక్కీని విష్ చేసింది.

ఇక ఈ అవార్డును అందుకుంటున్నప్పుడు, విక్కీ చిన్న ప్రసంగం కూడా చేశాడు. విక్కీ మాట్లాడుతూ, 'ఇది నాకు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డని ఇది చాలా ప్రత్యేకం అని అన్నారు. ఇది (సర్దార్ ఉదమ్ సింగ్) మా అందరికీ ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్న ఆయన షూజిత్ దాకు ధన్యవాదాలని అన్నారు. ఇక ఈ సినిమాలో నా నటన ఇర్ఫాన్ ఖాన్‌కి నివాళి అని పేర్కొన్న ఆయన వాళ్లను చాలా మిస్సయ్యానని అన్నారు.

ఇక తర్వాత విక్కీ వేదికపై నుండి కత్రినా కైఫ్‌తో మాట్లాడుతూ, 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చావని అన్నారు. విక్కీ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఫిల్మ్‌ఫేర్‌లో తన అవార్డుకు సంబంధించి అనేక పోస్ట్‌లను కూడా షేర్ చేశారు. 'సర్దార్ ఉదం 9 విభాగాల్లో అవార్డులు గెలిచిందని పేర్కొన్నారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కత్రినా - విక్కీ 9 డిసెంబర్ 2021న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వరకు తమ సంబంధాన్ని ధృవీకరించలేదు.పెళ్లి తర్వాత, ఈ జంట తమ ఫోటోలనుపోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరిచారు.

Also Read: Cobra Movie Review: విక్రమ్ నటించిన కోబ్రా మూవీ ఎలా ఉందంటే?

Also Read: Malayalam Hero in Mahesh film: ఏకంగా మళయాళ హీరోను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్.. అసలు ప్లాన్ అదే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News