Kathi Mahesh health condition: విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం

Kathi Mahesh health condition: నెల్లూరు: చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్‌ను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌కి (Medicover hospital in Nellore) తరలించి చికిత్స అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2021, 05:37 PM IST
Kathi Mahesh health condition: విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం

Kathi Mahesh health condition: నెల్లూరు: చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్‌ను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌కి (Medicover hospital in Nellore) తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కత్తి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నుదురు, కళ్లు, ముక్కు భాగాల్లో కత్తి మహేష్‌కి తీవ్ర గాయాలయ్యాయని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. తల భాగంలోనూ తీవ్ర గాయాలు కావడమే అతడి పరిస్థితి విషమించడానికి కారణంగా వైద్యులు చెబుతున్నారు.

Also read : MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా

ప్రమాదం జరిగిన సమయంలో కత్తి మహేష్‌తో పాటు (Kathi Mahesh meets with an accident) డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ.. వాహనం నడిపింది ఎవరనే విషయంలోనే స్పష్టత లేదు. కత్తి మహేష్ కుటుంబసభ్యులు (Kathi Mahesh family), స్నేహితులు మెడికవర్ హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం కత్తి మహేష్‌ని చెన్నైకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కత్తి మహేష్ సోదరి తెలిపారు.

కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని పలువురు టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహిత మిత్రులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు గతంలో పవన్ కల్యాణ్‌తో, పవన్ కల్యాణ్ అభిమానులతో (Pawan Kalyan fans) ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించిన కత్తి మహేష్ (Kathi Mahesh) ఇప్పుడిలా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మళ్లీ పాత అంశాలన్ని ప్రస్తావనకు వస్తుండటం గమనించవచ్చు.

Also read : Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News