Vyavastha : జీ5లో దుమ్ములేపేస్తోన్న ‘వ్య‌వ‌స్థ’.. హిట్టు కొట్టేసిన కామ్నా జెఠ్మలాని, హెబ్బా పటేల్

Kamna Jethmalani Vyavastha హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మాలాని, కార్తిక్ రత్నం, సంపత్ రాజ్ వంటి వారంతా కలిసి చేసిన వెబ్ సిరీస్‌ వ్యవస్థ ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ ప్రాజెక్ట్‌తో కామ్నా జెఠ్మలానీ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఆమెకు హిట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 06:03 PM IST
Vyavastha : జీ5లో దుమ్ములేపేస్తోన్న ‘వ్య‌వ‌స్థ’.. హిట్టు కొట్టేసిన కామ్నా జెఠ్మలాని, హెబ్బా పటేల్

Kamna Jethmalani Vyavastha క్రైమ్ థ్రిల్లర్స్, కోర్ట్ డ్రామాలు ఎప్పుడూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటాయి. గ్రిప్పింగ్ కథనం తోడైతే అవి సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు వ్యవస్థ సైతం అలాంటి హిట్ కొట్టేసింది.  ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించిన వ్యవస్థ ఇప్పుడు జీ5 యాప్‌లో సక్సెస్ ఫుల్‌గా ఆడేస్తోంది. ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌స్థ టీమ్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది.

ఈ సక్సెస్ మీట్‌కు యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా విచేశాడు. వ్యవస్థలో వర్క్ చేసిన వారందరరూ చాలా కావాల్సిన వారేనని అన్నాడు. సంపత్‌ గారితో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నానని తన కోరికను బయటపెట్టేశాడు. అలాగే కామ్నా జెఠ్మ‌లానీతో తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉందని చెప్పుకొచ్చాడు. 

హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్ తెలిపాడు. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను వ్య‌వ‌స్థ‌లో పోషించిన పాత్ర, నటించిన తీరు అద్భుతమని కొనియాడాడు. తేజ కాకుమాను మాట్లాడుతూ..  మా కార్తీక్, సంపత్ సార్, టీమ్ అంద‌రినీ చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అని అన్నారు. 

సందీప్ కిషన్ అన్న‌ను క‌లిసి త‌ర్వాత ఆయ‌న నాకు ఎప్పుడూ తిరుగులేని స‌పోర్ట్‌ను అందిస్తూనే ఉన్నాడని కార్తీక్ రత్నం చెప్పుకొచ్చాడు. ఆనంద్ రంగ‌గారి, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. వ్యవస్థ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోందని హెబ్బా ప‌టేల్ చెప్పుకొచ్చింది. 

Also Read:  Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్

ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించానని, చిన్న పాత్రే అయినా ప్రాముఖ్యత ఉండ‌టంతో యాక్సెప్ట్ చేశానని కామ్నా జెఠ్మలానీ చెప్పుకొచ్చింది. నిర్మాత ప‌ట్టాభి చిలుకూరి జీ 5, ఆనంద్ రంగాకి థాంక్స్‌ తెలిపాడు. నా టీమ్‌ను నా కుటుంబంగా భావించి వర్క్ చేశానని, అందుక‌నే మంచి ఔట్‌పుట్ వ‌చ్చిందని ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ అన్నాడు.

Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News