Kantara Copyright Issue: కాపీ రైట్ వివాదంలో కాంతార.. సూపర్ హిట్ సాంగ్ అక్కడి నుంచి ఎత్తేశారట?

Copy Allegations on Kantara: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాలోని వరాహ రూపం సాంగ్ ను తమ మ్యూజిక్ వీడియో నుంచి కాపీ కొట్టారని ఒక మలయాళ రాక్ బ్యాండ్ ఆరోపణలను గుప్పించింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 25, 2022, 08:36 AM IST
  • విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా కాంతర
  • సినిమాలో హైలైట్ గా వరాహ రూపం సాంగ్
  • అదే సాంగ్ పై కాపీ రైట్ ఆరోపణలు
Kantara Copyright Issue: కాపీ రైట్ వివాదంలో కాంతార.. సూపర్ హిట్ సాంగ్ అక్కడి నుంచి ఎత్తేశారట?

Kantara Varaha Roopam Copyright Issue in Telugu: కన్నడలో రూపొందిన కాంతార సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా కన్నడ హీరో రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే స్వయంగా హీరోగా నటించారు. కేవలం 16 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

తెలుగులో ఈ సినిమాని రెండు కోట్ల రూపాయలకి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ పేరిట కొనుగోలు చేయగా తెలుగులో భారీగా లాభాలు అర్ధించి పెడుతోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి శివ అనే పాత్రలో ఆసక్తికరమైన నటనతో ఆకట్టుకున్నాడు. సప్తమి గౌడ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వారందరూ అబ్బుర పడకుండా ఉండలేకపోతున్నారు.

ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్ళడానికి అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం కూడా కారణమైంది. తాజాగా అజనీష్ సంగీతం అందించిన వరాహ రూపం అనే సాంగ్ ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. కేరళలోని కొచ్చిన్ కి సమీపంలో ఉండే తైక్కుడం బ్రిడ్జి అనే ఒక రాక్ బ్యాండ్ రూపొందించిన నవరసం అనే ఒక ఆల్బమ్ లో ఉన్న సాంగ్ కి వరాహ రూపం సాంగ్ పూర్తిస్థాయిలో కాపీలా అనిపిస్తోందంటూ సదరు టాక్ బ్యాండ్ తన అఫిషియల్ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది.

ఇది ఇన్స్పిరేషన్ లా లేదని కచ్చితంగా కాపీరైట్ లాగానే ఉందని, చెబుతూ తాము లీగల్ గా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నామని సదరు సంస్థ ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ లో పేర్కొంది.

తైక్కుడం బ్రిడ్జ్ "కాంతార"తో ఏ విధంగానూ అనుబంధించబడలేదని మా శ్రోతలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నామని ఫేస్బుక్ పేజీలో పేర్కొన్న టాక్ బ్యాండ్ ఆడియో పరంగా మా IP "నవరసం" అలాగే "వరాహ రూపం" మధ్య ఉన్న అనివార్యమైన సారూప్యతలు కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

మా దృక్కోణంలో , "ప్రేరేపిత" మరియు "ప్లాజియరైజ్డ్" మధ్య ఉన్న లైన్ చాలా విభిన్నమైనది, వివాదాస్పదమైనది కాబట్టి మేము దీనికి కారణమైన సినిమా టీంపై చట్టపరమైన చర్యలను కోరతామని, వారు వాడిన కంటెంట్‌పై మా హక్కులకు ఎలాంటి అంగీకారం లేదు, అలాగే సినిమా క్రియేటివ్ టీమ్ ద్వారా పాట వారే చేసుకున్నట్టుగా ప్రచారం చేశారని పేర్కొన్న బ్యాండ్ హోంబలే ఫిల్మ్స్, అజనీష్ లోక్‌నాథ్, రిషబ్ శెట్టి, విజయ్ కిరగందూర్ లను ఆ పోస్టులో టాగ్ చేశారు. ఈ విషయం మీద రిషబ్ శెట్టి అలాగే సినిమా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కేజిఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబాలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. కేవలం 16 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు 150 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తెచ్చి పెట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

Also Read: Magh Amavasya 2023: మాఘ అమావాస్య ఎప్పుడు, శుభముహూర్తం, పూజ విధానం

Also Read: Magh Amavasya 2023: మాఘ అమావాస్య ఎప్పుడు, శుభముహూర్తం, పూజ విధానం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News