Manchu Vishnu: కన్నప్ప లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్‌ లుక్స్‌ విడుదల.. వైరల్ అవుతున్న పోస్టర్లు

Kannappa Teaser: హీరో విష్ణు మంచు కెరియర్ లోనే ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా సినిమాగా విడుదలకి సిద్ధం అవుతున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ అప్టేట్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి సోమవారం సినిమా నుంచి ముఖ్యమైన అప్డేట్‌ను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇవాల్టి అప్డేట్ ఆసక్తికరంగా మారింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 19, 2024, 10:16 PM IST
Manchu Vishnu: కన్నప్ప లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్‌ లుక్స్‌ విడుదల.. వైరల్ అవుతున్న పోస్టర్లు

Kannappa Characters Looks: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి సోమవారం సినిమాకి సంబంధించిన అప్డేట్లు విడుదల చేస్తూ ఏదో ఒక రకంగా సినిమా మీద హైప్ తీసుకురావడానికి చిత్ర బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్న నటీనటుల లుక్స్ కి సంబంధించిన పోస్టల్ విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి నటీనటులు పోషిస్తున్న పాత్రలను పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేసేసింది చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్‌ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు.. బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖేష్ రిషి ఈ సినిమాలో కంపడు పాత్ర పోషిస్తున్నారు. గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ సినిమాలో కనిపించనున్నారు. 

అత్యంత పురాతన పుళిందుల అనే ఒక ll భయంకరమైన తెగకు చెందినవారుగా వీళ్ళు ఈ సినిమాలో కనిపించనున్నారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వాయులింగానికి ఈ తెగ వారు వంశపారంపర్య రక్షకులు. వాళ్ళ నాయకుడు కంపడు. భద్రగణాన్ని నడిపిస్తూ ఉంటాడు. 

మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించనున్నారు.  ముఖేష్ కుమార్  దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు భారీగా మొదలు పెట్టనున్నారు.  డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News