Kannada Actor Ramya: కన్నడ నటి రమ్యకు వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు..!

Kannada Actor Ramya: సెలబ్రెటీలకు వేధింపులు ఆగడం లేదు. సోషల్‌ మీడియా వేదికగా కొందరు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే నటి రమ్యకు ఎదురైంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 10, 2022, 06:05 PM IST
  • సెలబ్రెటీలకు ఆగని వేధింపులు
  • సోషల్ మీడియాలో ట్రోల్
  • తాజాగా రమ్యకు చేదు అనుభవం
Kannada Actor Ramya: కన్నడ నటి రమ్యకు వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు..!

Kannada Actor Ramya: నటి పూజా హెగ్డేకు చేదు అనుభవ ఘటన మరవకముందే మరొకటి చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి రమ్యకు సోషల్‌ మీడియా నుంచి వేధింపులు ఎదురైయ్యాయి. ప్రీతమ్ ప్రిన్స్ అనే వ్యక్తి తనను తరచూ ట్రోల్ చేస్తున్నాడని..అసభ్యకర కామెంట్స్‌ చేస్తున్నాడని తెలిపింది. ఈమేరకు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమ్య సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగులో అభిమన్యు సినిమాలో ఆమె నటించింది. కాంగ్రెస్‌ ఎంపీగానూ రమ్య సేవలందించింది.

బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆమె రాజీనామా చేశారు. అభి అనే సినిమాలో రమ్య తొలిసారి నటించింది. దినేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పునీత్ రాజ్‌కుమార్‌తో జతకట్టింది. కన్నడ నాట స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె తెలుగులోనూ నటించించింది. ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఆమె వేధింపులు ఎక్కువైయ్యాయి. ఇండిగో విమాన సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఇటీవల మరో హీరోయిన్ పూజా హెగ్డే ట్వీట్ చేసింది. 

ముంబై నుంచి వస్తున్న ఇండిగో విమానంలో విపుల్ నకాషే అనే వ్యక్తి తనతో దురుసుగా ప్రవర్తించడని తెలిపింది. ఎలాంటి కారణం లేకుండానే అహంకారం, అజ్ఞానంతో మాట్లాడుతూ బెదిరించాడని పేర్కొంది. సాధారణం తాను ఇలాంటి ట్వీట్ చేయనని..కానీ ఈ ఘటన తనను ఎంతో బాధ పెట్టిందని ట్వీట్‌లో తెలిపింది.హీరోయిన్ పూజా హెగ్డే పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 

Also read:TS Governor Tamilsai: నాకో లెక్కుంది..నన్ను ఎవరూ ఆపలేరన్న గవర్నర్ తమిళిసై..!

Also read:Minor Rape Victim: రెచ్చిపోతున్న కామాంధులు..హైదరాబాద్‌లో మరో దారుణం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News