Chandramukhi 2 Collection: చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?

Chandramukhi 2 Collections: రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలిజ్ బిజినెస్ ఎంత వరకు జరిగింది? తొలి రోజు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుందో తెలుసుకుందా.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 05:14 PM IST
Chandramukhi 2 Collection: చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?

Chandramukhi 2 First day Box Office Collection: 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ చంద్రముఖి 2.  రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‍పై సుభాస్కరన్ నిర్మించగా.. తెలుగులోఈ మూవీని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ రిలీజ్ చేసింది. ఇందులో రాధికా శరత్ కుమార్, వడివేలు, సృష్టి దంగే, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, రావు రమేష్, విగ్నేష్, రవి మరియా, సురేష్ మీనన్, టీఎమ్ కార్తీక్, సుభిక్ష కృష్ణన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించారు. 

ప్రీ రిలిజ్ బిజినెస్ మరియు ఫస్ట్ డే కలెక్షన్స్
చంద్రముఖి 2 సినిమాను సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు మేకర్స్. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.10.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 3.50 కోట్లు, రాయలసీమలోని సీడెడ్‍లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రూ. 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నిర్ణయించబడింది. ఇక వరల్డ్ వైడ్‍గా రూ. 40 నుంచి 45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిట్ కొట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా  రూ. 46 కోట్లకుపైగా కలెక్ట్ చేయాలి. మరోవైపు చంద్రముఖి 2 తొలి రోజు రూ. 5.50 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి పోటీగా స్కంద ఉండటం వల్ల చంద్రముఖి 2 కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. 

Also Read: Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ హిట్టా? పట్టా?

Also Read: Skanda Movie Review: రామ్‌-బోయపాటి 'స్కంద' ఆడియెన్స్ ను మెప్పించిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News