Kalki 2898 AD: ఆ ఏరియాలో ‘కల్కి 2898 AD’ మూవీని పట్టించుకోని ప్రేక్షకులు..

Kalki 2898 AD: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా టిక్కెట్స్ కోసం రికమండేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆ ఏరియాలో మాత్రం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2024, 11:17 AM IST
Kalki 2898 AD: ఆ ఏరియాలో ‘కల్కి 2898 AD’ మూవీని పట్టించుకోని ప్రేక్షకులు..

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో $3 మిలియన్ యూఎస్ డాలర్స్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టడం విశేషం. అంతేకాదు టికెట్స్ కూడా ఓ రేంజ్ లో సోల్డ్ అయిపోతున్నాయి. దీంతో ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 362 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరోవైపు తమిళంలో ఈ సినిమా రూ. 16 కోట్లకు అమ్మడుపోయింది.  హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా రూ. 17 కోట్లు రాబట్టాలి.

కమల్ హాసన్ వంటి స్టార్ హీరో ఈ సినిమాలో ఉండటం కలిసొచ్చే అంశం. కానీ ఈ సినిమాకు తమిళంలో పెద్దగా ఓపెనింగ్స్ లేవనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు అక్కడ రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కనిపిస్తోంది. ఒక రకంగా ఇది నిరాశ కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉంది. కానీ తమిళ తంబీలు మాత్రం ప్రభాస్ ను లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

పైగా సలార్ మూవీ తమిళంలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మరోవైపు కర్ణాటకలో కూడా సరిగా నడవలేదు. కానీ కల్కి మూవీ మాత్రం కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సాలిడ్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. కానీ తమిళంలో ఈ సినిమాకు మంచి టాక్ వస్తే కానీ ఈ సినిమాకు అక్కడ బుకింగ్స్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా ఏది ఏమైనా ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News