Kajal Aggarwal Pics: 'చందమామ'లా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!

Actress Kajal Aggarwal Latest yellow punjabi dress Images goes viral. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్ అగర్వాల్ తాజాగా ఎల్లో చుడీదార్ ధరించి నిండు చందమామలా మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 08:00 PM IST
  • చందమామలా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్
  • తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం
  • కాజల్ అగర్వాల్ అందాల విందు
Kajal Aggarwal Pics: 'చందమామ'లా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!

Actress Kajal Aggarwal looks beautiful in yellow Anarkali dress: తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో కాజల్ అందరికీ తేలిపోయారు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో కాజల్ అగర్వాల్ మరింత పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో కాజల్ తన అందచందాలతో ఆకట్టుకున్నారు. 

2009లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ఆర్య 2, డార్లింగ్, బృదావనం,  మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో చందమామ స్టార్ హీరోయిన్ అయ్యారు. 

తెలుగులో బిజినెస్ మాన్, నాయక్, బాద్‍షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్, నేనే రాజు నేనే మంత్రి, కవచం, మోసగాళ్ళు వంటి హిట్ చిత్రాల్లో కాజల్ నటించారు. 

2020లో ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్.. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 

ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ నటించనున్నారు. మరో సినిమాకు కూడా చందమామ ఓకే చెప్పినట్టు సమాచారం.

ఓ బిడ్డకు తల్లయినా కాజల్ అగర్వాల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదు. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్ తాజాగా ఎల్లో చుడీదార్ ధరించి నిండు చందమామలా మెరిసిపోతున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 

Also Read: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్‌! భారత్‌ లక్ష్యం ఎంతంటే

Also Read: Poonam Bajwa Bikini: బికినీలో పూనమ్ బజ్వా.. స్విమ్మింగ్ పూల్‌లోని అందాలు తట్టుకోవడం కష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News