NTR Vardhanthi: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 26 వ వర్ధంతి నేడు. తాతయ్య వర్ధంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 26వ వర్ధంతి ఇవాళ. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా ఘన నివాళి అర్పించారు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ సుహాసిని ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కుమారుడు నారా లోకేష్‌లకు కరోనా వైరస్ సోకడంతో ఎన్టీఆర్ వర్ధంతికి (NTR Vardhanthi) దూరంగా ఉన్నారు.
కోవిడ్ నిబంధనల కారణంగా ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ రద్దైంది. మరోవైపు ఎన్టీఆర్ భవన్‌లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. తాతయ్య ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ నేటికీ ముమ్మాటికీ ధృవతార మీరే అంటూ ట్వీట్ చేశాడు.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻 pic.twitter.com/msOmHdOtvl
— Jr NTR (@tarak9999) January 18, 2022
Also read: Devi Sriprasad Comments: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో వేరెవరు నటించినా అంత సీన్ ఉండేది కాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook