ఎన్టీఆర్ చేతుల మీదుగా 'ఈ మాయ పేరేమిటో' ఆడియో

ఈ మాయ పేరేమిటో సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూపంలో మరో బూస్టింగ్

Last Updated : Jul 24, 2018, 07:11 PM IST
ఎన్టీఆర్ చేతుల మీదుగా 'ఈ మాయ పేరేమిటో' ఆడియో

ఈ మాయ పేరేమిటో సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూపంలో మరో బూస్టింగ్ లభించనుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుండగా తాజాగా ఈ మూవీ ఆడియోను లాంచ్ చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ వారసుడు రాహుల్ విజయ్ ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. జులై 28న ఎన్టీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్ కానుంది. దివ్య విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాము కొప్పుల డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ సీనియర్ కంపోజర్ మణిశర్మ మ్యూజిక్ అందించాడు. 

 

రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ వంటి నటులు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ విజయ్ మొదటి సినిమా ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం అనేది అతడి సినిమాకు ఒక రకంగా బూస్టింగ్ కానుంది. 

Trending News