Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అంటూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఇక ఇండియాలో ఇంత వరకు ఏ సినిమాకు, ఏ పాటకు కూడా ఈ అవార్డు దక్కలేదు. దీంతో ప్రధాని మోడీ నుంచి సీఎంల వరకు అంతా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను కీర్తించారు. ఇండియా జెండాను ఎగరవేశారంటూ కితాబిచ్చారు.
Thank you Sir.
— Jr NTR (@tarak9999) January 11, 2023
అయితే చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం జగన్ వంటి వారు కూడా నాటు నాటు పాటకు అవార్డు రావడం మీద స్పందించారు. తెలుగు జాతి జెండా ఇప్పుడు ఆకాశంలో రెపరెపలాడుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున ఆర్ఆర్ఆర్ టీంకు, కీరవాణి, రాజమౌళి, తారక్, రామ్ చరణ్ ఇలా అందరికీ కంగ్రాట్స్.. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది అని వైఎస్ జగన్ అభినందించాడు. దీనికి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ థాంక్యూ సర్ అని అన్నాడు.
Thank you so much mavayya.
— Jr NTR (@tarak9999) January 11, 2023
ఇక ఇదే అవార్డు రావడంపై చంద్రబాబు ఇలా స్పందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందన్న వార్త విని నాకు ఎంతో సంతోషంగా ఉంది.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది.. కీరవాణి, రాజమౌళి టీంకు కంగ్రాట్స్.. నిజంగాననే ఎంతో గర్వంగా ఉంది.. ఇది వరకు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇండియాకు తెలుగు అనేది చిహ్నంగా మారింది అని అన్నాడు. ఇక దీనికి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ సో మచ్ మావయ్య అని స్పందించాడు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో కీరవాణి కంటతడి పెట్టేసుకున్నాడు. స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యాడు. రాజమౌళికే ఈ పూర్తి క్రెడిట్ అని, ఆయన విజన్ వల్లే ఇదంతా సాధ్యమైందని కీరవాణి కంటతడి పెట్టేసుకున్నాడు. పాట పాడిన కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్, రాసిన చంద్రబోస్‌లను స్టేజ్ మీద తలుచుకున్నాడు కీరవాణి. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కూడా సాధిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి