Jr NTR Party : సుకుమార్, దిల్ రాజు అందుకే రాలేదట.. రామ్ చరణ్‌ ఎన్టీఆర్‌కు గ్యాప్?.. పార్టీ వెనుక మతలబు ఏంటంటే?

Jr NTR Private Party ఎన్టీఆర్ ఇంట్లో సడెన్ పార్టీ ఒకటి జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీలో టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నిర్మాతలు పార్టీలో కనిపించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సుకుమార్, దిల్ రాజు కూడా రావాల్సిందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 09:53 AM IST
  • దర్శక నిర్మాతలకు ఎన్టీఆర్ పార్టీ
  • ప్రైవేట్ పార్టీలో యంగ్ టైగర్ సందడి
  • పార్టీ వెనుక కారణం ఏంటి?
Jr NTR Party : సుకుమార్, దిల్ రాజు అందుకే రాలేదట.. రామ్ చరణ్‌ ఎన్టీఆర్‌కు గ్యాప్?.. పార్టీ వెనుక మతలబు ఏంటంటే?

Jr NTR Private Party రామ్ చరణ్‌ బర్త్ డే నాడు మెగాస్టార్ ఇంట్లో టాలీవుడ్ అంతా కనిపించింది. దర్శక నిర్మాతలందరూ ఆ పార్టీకి హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ తన ఇంట్లో టాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాతలను ఆహ్వానించాడు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్‌ సైతం ఈ పార్టీలో కనిపించాడు. సుకుమార్, దిల్ రాజు వంటి వారిని కూడా ఎన్టీఆర్ పిలిచాడట. పుష్ప షూటింగ్ కోసం సుకుమార్ వైజాగ్‌లో బిజీగా ఉన్నాడట. శాకుంతలం ప్రమోషన్స్ కోసం దిల్ రాజు ఢిల్లీకి వెళ్లాడట. అందుకే వారిద్దరూ రాలేదని తెలుస్తోంది.

ఇక ఈ పార్టీకి రామ్ చరణ్‌ను పిలిచినట్టుగా కనిపించడం లేదు. అయితే అసలు ఈ పార్టీ ఎందుకు సడెన్‌గా ఏర్పాటు చేశాడన్నది కూడా క్లారిటీ రావడం లేదు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్‌ ఎందుకు వచ్చాడు.. ఏదైనా సినిమా విషయం గురించి చర్చించారా? భారీ ఎత్తున ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఈ పార్టీలో త్రివిక్రమ్, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు కనిపించారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

మైత్రి నిర్మాతలు, వైజయంతీ నుంచి స్వప్నా దత్, సితార నుంచి నాగవంశీ ఇలా అందరూ వచ్చారట. కానీ వారంతా త్వరగా వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ పార్టీ అనేది ఎక్కువగా టాలీవుడ్‌లో చర్చకు దారి తీస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు తన ప్రాజెక్టులను చకచకా పూర్తి చేయాలని చూస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

రామ్ చరణ్‌ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్త మరోసారి ట్రెండ్ అవుతోంది. ఈ డిన్నర్ పార్టీకి రామ్ చరణ్‌ను పిలవకపోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ పార్టీకి హీరోలెవ్వరినీ కూడా ఎన్టీఆర్ పిలవలేదని, గ్యాప్ పెరిగిందనే టాక్ నిజం కాదని సోషల్ మీడియాలో మరో టాక్ వినిపిస్తోంది.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News