Jr NTR: RRR ఎప్పుడొస్తుందో తెలియదు అందుకే కేజీఎఫ్ దర్శకుడితో తారక్ సిట్టింగ్ ?

జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ప్రస్తుతం రాజమౌళితో ( SS Rajamouli ) RRR చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ  సినిమాకు తన కెరీర్ లో ఎప్పుడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంతకు మించి భారీగా డేట్స్ బుక్ చేసి పెట్టాడు.

Last Updated : Aug 11, 2020, 04:30 PM IST
    1. RRR విడుదల తేదీ విషయంలో మరింత జాప్యం ?
    2. అందుకే తరువాత ఏం చేయాలో ఆలోచిస్తున్న తారక్
    3. కేజీఎఫ్ దర్శకుడితో సినిమా చేసే అవకాశం?
Jr NTR: RRR ఎప్పుడొస్తుందో తెలియదు అందుకే కేజీఎఫ్ దర్శకుడితో తారక్ సిట్టింగ్ ?

జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ప్రస్తుతం రాజమౌళితో ( SS Rajamouli) RRR చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తన కెరీర్ లో ఎప్పుడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంతకు మించి భారీగా డేట్స్ బుక్ చేసి పెట్టాడు. అయితే రాజమౌళి సినిమాలు అలా అలా డేట్స్ మారుతూ ఉంటాయి అని మనకు తెలిసిందే. పైగా కరోనావైరస్ ( Coronavirus )  వల్ల మరింత ఆలస్యం జరగనుంది అని స్పష్టం అవుతోంది. సమ్మర్ లో కూడా సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఇప్పటి నుంచే RRR తరువాత చేయాల్సిన సినిమా గురించి ఆలోచించడం మొదలు పెట్టాడని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ (KGF Chapter 1, KGF Chapter 2 ) దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) తో సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నాడట. ప్యాన్ ఇండియా సినిమాగా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే మరో వైపు త్రివిక్రమ్ ( Trivikram ) తో కూడా సినిమా చేయాలని జూనియర్ ఎన్టీర్ అనుకుంటున్నాడట. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అంటే చాలా ఫాస్ట్ గా పక్కాగా చిత్రీకరణ జరిగి మంచి ప్రోడక్ట్ బయటికి వస్తుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. అయితే అన్నింటికన్నా ముందు RRR సినిమా ముందు విడుదల అవ్వాలి. Salon In Corona Time: హెయిర్ సెలూన్ లేదా పార్లర్ కు వెళ్తున్నారా.. ఈ చిట్కాలు పాటించండి

Trending News