RRR OTT release date: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!

RRR OTT release date:   సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.    

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 12:46 PM IST
RRR OTT release date:  'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!

RRR Movie OTT release date:  సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై (RRR OTT Releasing Date ) క్లారిటీ వచ్చేసింది. ఇది జీ5,  నెట్‌ఫ్లిక్స్ లలో జూన్ 3న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 (ZEE5) భారీ డీల్‌కు సొంతం  చేసుకోగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేసింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తోందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతుంది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) (RRR Movie). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీస్ ముందు బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈచిత్రం  రూ. 1,000 కోట్ల మార్క్ ను దాటేసింది. అల్లూరి సీతారామరాజుకు రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశారు. అలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, సముద్రఖని తదితరులు వారి పరిధి మేరకు మెప్పించారు. కీరవాణి అందించిన సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా మరిన్ని  మైలురాళ్లను అందుకునే దిశగా దూసుకెళ్తుంది. 

Also Read: Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News