Santosham Awards: చిన్న పొరపాట్లు సాధారణమే.. కావాలనే నాపై బురద చల్లుతున్నారు : సురేష్ కొండేటి

Suresh Kondeti: సంతోషం వారపత్రిక.. అధినేత ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఈమధ్య సెలబ్రిటీస్ ని అడిగే కాంట్రవర్సీ ప్రశ్నల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. కాగా ఈయన ఈ మధ్య నిర్వహించిన సంతోషం అవార్డ్స్ లో కొన్ని పొరపాట్లు జరగడంతో దానిపై మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు సురేష్.. మరి అవి ఏవో ఒకసారి చూద్దాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 06:51 PM IST
Santosham Awards: చిన్న పొరపాట్లు సాధారణమే.. కావాలనే నాపై బురద చల్లుతున్నారు : సురేష్ కొండేటి

 Suresh Kondeti Controversy: ఈమధ్య సినిమా ప్రెస్ మీట్స్ లో.. ఆ సినిమా హీరో హీరోయిన్ల కన్నా కూడా ఎక్కువగా సురేష్ కొండేటి పైనే ప్రేక్షకుల చూపు ఉంటోంది. దానికి ముఖ్య కారణం ఆయన వాళ్లని అడిగే కాంట్రవర్సీ ప్రశ్నలే. అయితే సురేష్ ఒకప్పుడు చాలా పేరు తెచ్చుకున్న ‘సంతోషం’ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు కూడా అవ్వడంతో ఆయనంటే సినీ వర్గాల్లో తెలియని వారు లేరు. కాగా ఈయన చాలా సంవత్సరాల నుంచి సౌత్ ఇండస్ట్రీకి  సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట పురస్కారాలు ఇస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన వారికి ఈ అవార్డు వేడుకలు పురస్కారాలు ఇస్తారు. గత సంవత్సరం వరకు ఈ అవార్డుల ఫంక్షన్ హైదరాబాదులో జరగగా,‌మిగిలిన మూడు ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు ఇక్కడికే వచ్చేవారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ అవార్డులు గోవాలో జరిగాయి. ఇక నాలుగు సినిమా ఇండస్ట్రీల నుంచి తారలు గోవా వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఈ గోవాలో జరిగిన అవార్డుల వేడుల్లో కన్నడ సినీ నటులకు అవమానం జరిగిందని ఓ కన్నడ సినీ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గోవాలో సరిగ్గా కన్నడ వారికి హోటల్ రూములు కూడా ఇవ్వలేదని.. అందువల్ల అవార్డుకు వెళ్లిన కన్నడ తారలు రిసెప్షన్ ఏరియాలో ఉండిపోయారని.. వారికి సంబంధించిన వీడియోలను కూడా బయటపెట్టారు. అంతేకాదు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన అవార్డులు తీసుకుంటున్న సమయంలో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశారని శారద అనే జర్నలిస్ట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ విషయంపై ఫైనల్ గా స్పందించారు సురేష్ కొండేటి. తనపై కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారు అని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. 
‘అందరికీ నమస్కారం. నేను దాదాపు 20 సంవత్సరాల పైనుంచి సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను. ఈ అవార్డులు పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు తెలుగు ఇండస్ట్రీ అనే కాదు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్‌లో జరిగిన కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల.. వచ్చిన 1200 మంది సెలబ్రిటీస్‌కి రూమ్స్ సర్దుబాటు విషయంలో కొంచెం ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్‌లో కొన్ని పొరపాట్లు జరగడం చాలా సహజం. అది ఉదేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ వేశాడు సురేష్ కొండేటి.

ఇక ఆయనపై కావాలనే ఇలా కొంతమంది బురద చల్లుతున్నారు అనడంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News