Anushka and Naveen Polishetty: అనుష్కతో ఖరారైన నవీన్ పోలిశెట్టి అప్‌కమింగ్ మూవీ, కధ ఏంటో తెలుసా

Anushka and Naveen Polishetty: టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టితో అప్‌కమింగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ఖరారైంది. సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొస్తున్న అనుష్క శెట్టి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2021, 01:32 PM IST
Anushka and Naveen Polishetty: అనుష్కతో ఖరారైన నవీన్ పోలిశెట్టి అప్‌కమింగ్ మూవీ, కధ ఏంటో తెలుసా

Anushka and Naveen Polishetty: టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టితో అప్‌కమింగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ఖరారైంది. సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొస్తున్న అనుష్క శెట్టి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

జాతిరత్నాలు సినిమాతో (Jathiratnalu Movie) హల్‌చల్ చేసి అందరినీ ఆకట్టుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఇప్పుుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం అగ్రనటి అనుష్క శెట్టితో సినిమానే. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా ఖరారైందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 26న అంటే ఇవాళ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. చాలా రోజుల్నించి అనుష్క శెట్టి హీరోయిన్ అనే వార్తలొస్తున్నాయి గానీ..ఇవాళ అధికారికంగా నిర్ధారణైంది. మరోవైపు అనుష్క శెట్టికి (Anushka Shetty) సుదీర్ఘ విరామం తరువాత ఇదే సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి అప్‌కమింగ్ సినిమా కథ ఏంటనేదానిపై వివిధ రకాల వార్తలు ట్రోల్ అవుతున్నాయి. 40 ఏళ్ల మహిళను 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనేదే కధ అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 

Also read: Parineeti Chopra Hot Photos: బ్లాక్ కలర్ జాకెట్‌లెస్ అవుట్‌ఫిట్‌తో మత్తెక్కిస్తున్న పరిణితి చోప్రా అందాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News