Jabardasth Anchor Sowmya Rao జబర్దస్త్ యాంకర్ సౌమ్య, హైపర్ ఆది ట్రాక్‌కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. భలే మంచి రోజు అనే ఈవెంట్లో ఆది మీద సౌమ్య వేసిన సెటైర్లతోనే ఆమె వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కన్నడలో సీరియల్స్ చేసినా, తెలుగు ధారావాహికల్లో నటించినా రాని గుర్తింపు ఆ ఒక్క ఈవెంట్లో ఆమె వేసిన సెటైర్లతో వచ్చింది. ఆ తరువాత అనూహ్యంగా జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకోవడం, వేరే ఎవ్వరూ దొరక్కపోవడంతో సౌమ్యకు ఆ అవకాశం వచ్చింది.
అలా వచ్చిన అవకాశాన్ని సౌమ్య సైతం చక్కగా వినియోగించుకుంది. తెలుగు రాకపోయినా తన మాటలతో, లుక్స్‌తో, గ్లామర్‌తో ఆకట్టుకుంటూ వచ్చింది. ఆదితో సౌమ్య ట్రాక్ బాగానే క్లిక్ అయింది. అలా ఆదిని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ అందరి దృష్టిలో పడింది. ఇక సౌమ్యను సైతం ఆది ఎలా అంటాడు.. ఎలాంటి కౌంటర్లు వేస్తాడో అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా హోలీకి సంబంధించిన ఈవెంట్ ప్రోమోను రిలీజ్ చేశారు. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్లో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. మానస్ రొమాంటిక్ పర్ఫామెన్స్తో చెమటలు పట్టిస్తే.. అర్జున్, నిరుపమ్ ఇద్దరూ కలిసి మాస్ డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే.. ఆదిని సౌమ్య అన్న మాటలు ఇంకో ఎత్తు.
ఆదికి డ్రైవింగ్ రాదు. కారు డ్రైవింగ్ గానీ బైక్ రైడింగ్ గానీ రానట్టుగా కనిపిస్తోంది. దీంతో ఆదికి ఓ టాస్క్ ఇచ్చారు. స్కూటీ మీద సౌమ్యను ఓ రౌండ్ తిప్పాలనే టాస్క్ ఇచ్చారు. ఆమెకు ధైర్యం ఉంటే నాకు ఓకే అని ముందే హింట్ ఇచ్చాడు ఆది. కానీ స్కూటీ మీద సౌమ్య ఎక్కడం, ఆదికి చేతులు వణకడం, పక్కనే ఉన్న రవి స్కూటీ స్టార్ట్ చేయడం, ఆది కంగారు పడటం, నడపలేకపోవడంతో సౌమ్య కిందపడబోయేది.
దీంతో సౌమ్యకు చిర్రెత్తుకొచ్చింది. నీకు కామెడీ రాదు, యాక్టింగ్ రాదు..డ్యాన్స్ రాదు.. ఈ డ్రైవింగ్ కూడా రాదా? అని పరువుతీసేసింది సౌమ్య. దీంతో ఆది మొహం మాడిపోయినట్టుగా అయింది. మొత్తానికి ఆది చేసిన ఈ కామెడీ మాత్రం ప్రోమోకు హైలెట్‌గా నిలిచింది. నిజంగానే ఆదికి డ్రైవింగ్ రాదా? లేకా ఇది టీఆర్పీ స్టంటా? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook