Ishq Pre Release Event: పార్క్ హయత్‌లో ఇష్క్ ప్రి రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం

Ishq Pre Release Event: తేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఇష్క్’.. నాట్ ఏ లవ్ స్టోరీ. ఎస్ఎస్ తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. నేటి సాయంత్రం ఇష్క్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 18, 2021, 02:21 PM IST
Ishq Pre Release Event: పార్క్ హయత్‌లో ఇష్క్ ప్రి రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం

Ishq Pre Release Event: టాలీవుడ్‌లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించిన తేజ సజ్జ ఇటీవల 'జాంబీ రెడ్డి' మూవీతో హీరో ట్రాక్ మొదలుపెట్టాడు. తాజాగా మరో కొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఇష్క్’.. నాట్ ఏ లవ్ స్టోరీ. దర్శకుడు ఎస్ఎస్ రాజు తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. నేటి సాయంత్రం ఇష్క్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. యంగ్ హీరోలు సందీప్ కిషన్, నారా రోహిత్, శ్రీవిష్ణు, దర్శకుడు శ్రీరామ్ వేణు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

మరోవైపు కన్నుగీటి ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన కేరళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కథానాయిక. అయితే క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఏప్రిల్ 23న థియేటర్లలో Tollywood మూవీ ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇష్క్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.  ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, అంజన్ కుమార్ సినిమాను నిర్మించగా, మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు. 

Also Read: Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ప్రభాస్

తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash Varrier) జంటగా నటించిన ఇష్క్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇష్క్ ట్రైలర్‌లో ప్రేమికుల ముద్దు ముచ్చట్లు చూసి లవ్ స్టోరీ అని టాలీవుడ్ ప్రేక్షకులు ఊహించారు. కానీ లవ్ స్టోరీ కాదని చెబుతూ రొమాన్స్ ఎలా చేశారు, సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందనే ఆలోచనలతో ఇష్క్ సినిమాకు ఊహించిన దానికన్నా అధికంగా స్పందన వచ్చింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ, మేఘా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ హౌస్. 

Also Read: Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News