Dil Raju Shock: చిరంజీవి, బాలయ్య కంటే తోపు అనిపించుకున్న దిల్ రాజు?

Is Dil Raju Stronger than Chiranjeevi and Balakrishna: విశాఖపట్టణంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, వారసుడు సినిమాల థియేటర్ల విషయంలో బాలకృష్ణ, చిరంజీవి కంటే బలవంతుడిని అనిపించుకున్నారు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 2, 2023, 01:54 PM IST
Dil Raju Shock: చిరంజీవి, బాలయ్య కంటే తోపు అనిపించుకున్న దిల్ రాజు?

Is Dil Raju Stronger than Chiranjeevi and Balakrishna: అదేంటి చిరంజీవి, బాలకృష్ణ కంటే దిల్ రాజు బలవంతుడా? ఇప్పుడు ఇదే అనుమానం విశాఖ ప్రజలను పట్టి కుదిపేస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి.

బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరసింహారెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా వాల్తేరు వీరయ్య సినిమాని బాబీ డైరెక్ట్ చేశాడు.

ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. వాస్తవానికి ఈ సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయాలని భావించి మైత్రి మూవీ మేకర్స్ సంస్థను సంప్రదించారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్వయంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరుచుకోవాలని భావిస్తూ దిల్ రాజుకు ఇవ్వలేమని చెప్పారు. దీంతో కాస్త హర్ట్ అయిన దిల్ రాజు అప్పటికప్పుడు వారసుడు అనే సినిమాని సంక్రాంతి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడమే కాక ఇదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అజిత్ కుమార్ తెగింపు, సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం వంటి సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు విశాఖపట్నం విషయంలో మాత్రం చిరంజీవి, బాలకృష్ణ కంటే దిల్ రాజే బలవంతుడిని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో ఐనాక్స్ స్క్రీన్స్ తప్పించి వీరసింహారెడ్డి అనే సినిమాకి విశాఖపట్నంలో లీలామహల్ ఒక్కటే థియేటర్ గా లభించింది. ఈ సినిమా ధియేటర్ పెద్దగా పేరున్న థియేటర్ ఏమీ కాదు, నిర్మాతలకు అది లీస్ట్  ప్రిఫరెన్స్. ఇక వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం జగదాంబ, శరత్ థియేటర్లను దక్కించుకోగలిగింది. కొంతమేర పేరు ఉన్న థియేటర్లను దక్కించుకోగలిగినా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇలాంటి దారుణమైన రిలీజ్ ముందెన్నడూ చూడలేదని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు.

నందమూరి బాలకృష్ణ అభిమానుల సంగతి అయితే సరే సరి. వారు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక రకంగా షాక్ కి గురైన పరిస్థితుల్లో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ రంగంలోకి దిగుతారు మంచి థియేటర్లను దక్కించుకుంటారు అని అందరూ ఆశిస్తున్న తరుణంలో దిల్ రాజు ఎవరికి ఊహించని విధంగా తన పట్టు నిలుపుకుంటూ మెయిల్ థియేటర్లను దక్కించు కోవడంతో ఇప్పుడు వారిద్దరి కంటే దిల్ రాజే బలవంతుడా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

Also Read: AHA Video APP Crash: ప్రభాస్ ఫాన్స్ వల్లే యాప్ క్రాష్ అయిందా.. వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?

Also Read: Chitra Wagh Demands Urfi Arrest: ఏంటా బట్టలు.. 'ఉర్ఫీ'ని అరెస్ట్ చేయండన్న బీజేపీ ఎంత.. ఘాటు రిప్లై!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News