Cricketers Promote Pushpa: స్టార్ క్రికెటర్లు 'పుష్ప' పాటలకు స్టెప్పులు వేసింది అందుకేనా? బయటపడిన అమెజాన్ ప్లాన్!!

క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 04:42 PM IST
  • డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు పుష్ప
  • బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప
  • క్రికెటర్లు 'పుష్ప' పాటలకు స్టెప్పులు వేసింది అందుకేనా
 Cricketers Promote Pushpa: స్టార్ క్రికెటర్లు 'పుష్ప' పాటలకు స్టెప్పులు వేసింది అందుకేనా? బయటపడిన అమెజాన్ ప్లాన్!!

Amazon Paid Cricketers to Promote Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ సోయగం రష్మిక నటించిన 'పుష్ప: ది రైజ్‌' సినిమా భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని శ్రీవల్లి, 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలు పాడడం.. టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్‌లను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్‌ను చాలా మంది అనుకరిస్తున్నారు. 

పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటినుంచి స్టార్ క్రికెటర్లు వరుసగా 'శ్రీవల్లి' పాటలో అర్జున్ వేసిన స్లిప్పర్ స్టెప్‌ను రిక్రియేషన్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రావో, షకిబుల్ హాసన్ శ్రీవల్లి స్టెప్ చేసారు. ఆ వీడియోను తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యాయి. ఫాన్స్ అందరూ తెగ సంబరపడిపోయారు. 

అయితే క్రికెటర్లు ఇలా వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్పను ఓటీటీలో విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది. ఆటగాళ్లు శ్రీవల్లి హుక్ స్టెప్ వేసేందుకు డబ్బు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకే అమెజాన్ ఇదంతా చేసిందట. మరి ఇందులో ఎంత నిజముందో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయంపై చిత్రబృదం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. బన్నీ ఊరమాస్‌ యాంగిల్‌ అందరికి బాగా నచ్చింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక తనదైన శైలిలో నటించారు. సునీల్, అనసూయ కూడా ఆకట్టుకున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' కూడా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. 
Also Read: IND vs WI: బంపర్ ఆఫర్ పట్టేసిన షారుక్ ఖాన్, సాయి కిషోర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!

Also Read: Rashid Khan Six: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! బంతిని చూడకుండానే భారీ సిక్సర్ బాదిన స్టార్ క్రికెటర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Raina (@sureshraina3)

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News