Inti No.13 Movie Review: ఇంటి నంబర్ 13 మూవీ రివ్యూ.. భయపెట్టే హార్రర్ థ్రిల్లర్..

Inti Number 13 Movie Review: ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో  హార్రర్ సినిమాలకు ఎపుడు తెరకెక్కించిన మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జానర్‌లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో ఈ రోజు విడుదలైన  మరో హార్రర్ చిత్రం 'ఇంటి నంబర్ 13'. హాలీవుడ్ మూవీ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2024, 07:48 PM IST
Inti No.13 Movie Review: ఇంటి నంబర్ 13 మూవీ రివ్యూ.. భయపెట్టే హార్రర్ థ్రిల్లర్..

రివ్యూ: ఇంటి నెం. 13 (Chaari 111)
నటీనటులు: నవీద్‌బాబు, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్ రాజ్, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, నెల్లూరు సుదర్శన్‌,విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్‌, దేవియాని, శివన్నారాయణ, సత్యకృష్ణ,  తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్
ఎడిటర్: సాయినాథ్ బద్వేల్
సంగీతం: వినోద్ యాజమాన్య
నిర్మాత: హేషన్ పాషా, డాక్టర్ బర్కతుల్లా
దర్శకత్వం: పన్నా రాయల్
విడుదల తేది: 1-3-2024

Inti No.13 Movie Review: ‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి  హారర్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు పన్నారాయల్. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ 'ఇంటి నెం.13'. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.మరి ఈ సినిమా గత హార్రర్ థ్రిల్లర్ మూవీస్‌లాగానే ఈ మూవీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమా కూడా ఇంటి నెంబర్ 13 అనే పెద్ద భవంతిని ఆవహించిన ప్రేతాత్మ కథనే ఈ సినిమా స్టోరీ అని చెప్పాలి. కథ విషయానికొస్తే.. కట్ చేస్తే అర్జున్ ఫేమస్ రైటర్..అతను  రాసిన నవలకు బహుమానంగా ఇంటి నెంబర్ 13 అనే విల్లాను బహుమానంగా వస్తోంది. ఆ ఇంట్లో  అతని  అన్నయ్య సంజయ్‌ కుటుంబ సభ్యులతో ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో కొన్ని చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఒక సైక్రియాటిస్ట్ ఆ ఇంట్లో వచ్చి.. ఆ ఇంట్లో ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడనేదే ఇంటి నెంబర్ 13 మూవీ. ఈ  క్రమంలో ప్రేతాత్మలు, ఆత్మలు ప్రేక్షకులను ఎలా భయపెట్టాయనేది సినిమాలో చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.ఏ మూవీ అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే  స్టార్ట్ అవుతోంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానంలో ప్రత్యేకత ఉంది. సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డు ‌ వరకు ఎక్కడా బోర్‌ లేకుండా, ల్యాగ్‌ లేకుండా నడిపించడంలో దర్శకుడు పన్నా రాయల్‌ విజయం సాధించాడనే చెప్పాలి. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. రెగ్యులర్‌ హారర్‌ మూవీస్‌లో చూపించే సమస్యలు కాకుండా కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మొదటి భాగం కంటే సెకండాఫ్ మరింత క్రిస్పీగా ఈసినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మరో పెద్ద ఎస్సెట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. పి.ఎస్. మణికర్ణన్  సినిమాటోగ్రపీ బాగుంది. దర్శకుడు నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాత హేషన్ పాషా ఖర్చు తెరపై కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా చివర్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పి ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో నటంచిన నవీద్‌, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా పాత్రల్లో నటించిన తనికెళ్ల భరణి, రవి వర్మ, శివన్నారాయణ, పృథ్వీరాజ్ తమ క్యారెక్టర్స్‌లో లీనమై నటించారు.  

ప్లస్ పాయింట్స్

భయపెట్టే కథనం

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

రెగ్యులర్ స్టోరీ

రొటీన్ సీన్స్

ఫస్టాఫ్

రేటింగ్.. 2.75/5

పంచ్ లైన్.. ఇంటి నెం. 13.. భయపెట్టే హార్రర్ థ్రిల్లర్..

Also read: Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News