Devara Update: జూ. ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Devara Movie: జూనియర్‌ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 04:53 PM IST
Devara Update: జూ. ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Devara Shooting Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr)- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ దేవర. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా భైర అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుంచి ఏ న్యూస్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. రీసెంట్ గా తెరకెక్కించిన అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. 

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం తారక్ కు సంబంధించిన సోలో సన్నివేశాలను హైదరాబాద్ సమీపంలోని ఓ సెట్ లో చిత్రీకరిస్తున్నారట. ఇది అయిపోగానే మిగతా నటీనటులతో సీన్లను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్ క్లైమాక్స్ సన్నివేశాలను ముందుగానే షూట్ చేసింది. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా సినిమా ఆలస్యం కాకుడదనే కొరటాల టీం ఈ నిర్ణయం తీసుకుంది. 

సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్షేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఫేమస్ రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.ఇందులో మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో (Shine Tom Chacko) కీ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 05న థియేటర్లలో సందడి చేయనుంది. 

Also Read: Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News