Adipurush: ప్రభాస్ మూవీకి ఆ మాత్రం బడ్జెట్ కావాల్సిందేగా!

బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్లను తలదన్నేలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమాల చేయడానికి పోటీ పడుతున్నాయి. 

Last Updated : Nov 13, 2020, 04:26 PM IST
    1. బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
    2. బాలీవుడ్ స్టార్లను తలదన్నేలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమాల చేయడానికి పోటీ పడుతున్నాయి.
    3. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న డార్లింగ్ నాగ్ అశ్విన్ తో మరో సినియా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసే ఉంటుంది.
Adipurush: ప్రభాస్ మూవీకి ఆ మాత్రం బడ్జెట్ కావాల్సిందేగా!

బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్లను తలదన్నేలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమాల చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న డార్లింగ్ నాగ్ అశ్విన్ తో మరో సినియా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసే ఉంటుంది. టీ సిరీస్ తో కలిసి ఆదిపురుష్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతోంది.

Also Read | Diwali 2020 Gifts: దీపావళి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి 

ఆదిపురుష్ ( Adipurush ) చిత్రాన్ని తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో సైఫ్ అలీఖాన్ రావుణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీని ప్రభాస్ రేంజ్ లో ( Prabhas ) రూ.400 కోట్లతో తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా త్రీడీ చిత్రం కానుంది అని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు. 

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!

పౌరాణిక చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు ఆ మాత్రం బడ్జెట్ కావాల్సిందే అంటున్నాడు దర్శకుడు. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా చాలా మంది దర్శకనిర్మాతలు బడ్జెట్ తగ్గించేందుకు ప్రయత్నిస్తోంటే.. ఓం రావత్ మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అని అంటున్నాడట.

ఈ చిత్రంలో ఎక్కువగ్రాఫిక్స్ ఉంటుంది అని దానికి చాలా ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది. మొత్తం చిత్రాన్ని గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించన్నారట.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News