Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!

Ileana D'cruz Bikini Picture: కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో ఉందంటూ వార్తల్లోకి ఎక్కిన ఇలియానా  తాజాగా తన బికినీ ఫోటో షేర్ చేసి ఆసక్తి రేకెత్తించింది. బీచ్ వెకేషన్ కి వెళ్లి బికినీలో ఫోటో తీసుకుని షేర్ చేయకపోతే కిక్కేముంది అంటూ బీచ్ లో బికినీతో దిగిన ఫోటో ని షేర్ చేసి ఇలియానా కాక రేపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 09:55 AM IST
  • కాకరేపుతున్న ఇలియానా డిక్రూజ్
  • బికినీలో హాట్ ట్రీట్
Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!

Ileana D'cruz Bikini Picture: దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోవా భామ ఇలియానా డిక్రీజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రెండో సినిమాతోనే పోకిరి లాంటి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తరువాత టాలీవుడ్ లో కొన్నాళ్లపాటు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే జల్సాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన ఈ భామ దాదాపు 4-5 ఏళ్ల పాటు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అయితే చేసిన సినిమాలన్నీ దెబ్బ పడిపోతూ ఉండడంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపింది.

అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఒక ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్ళింది. ఆ తర్వాత పెళ్లి కుదరలేదు ఏమో కానీ బ్రేకప్ కావడంతో పూర్తిస్థాయిలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లపాటు సినిమాలకు కూడా దూరం అయిపోయిన ఈ భామ తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలో నిలబడేందుకు ప్రయత్నాలు చేసింది. తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాతో రి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించింది.

కానీ ఆ సినిమా కూడా దెబ్బ పడిపోవడంతో అప్పటినుంచి మళ్ళీ బాలీవుడ్ నే నమ్ముకుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఈ మధ్యనే కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో ఉందంటూ వార్తల్లోకి ఎక్కిన ఈ భామ తాజాగా తన బికినీ ఫోటో షేర్ చేసి ఆసక్తి రేకెత్తించింది. బీచ్ వెకేషన్ కి వెళ్లి బికినీలో ఫోటో తీసుకుని షేర్ చేయకపోతే కిక్కేముంది అంటూ బీచ్ లో బికినీతో దిగిన ఫోటో ని షేర్ చేసి ఇలియానా కాక రేపింది. ఇక ఆమె పెట్టిన పోస్ట్ కి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

బీచ్ కి వెళ్ళిన అందరూ బికినీలో ఫోటోలు పెట్టడం కష్టం కదా అంటూ అబ్బాయిలు కామెంట్ చేస్తుంటే అమ్మాయిలు మాత్రం ఈ స్వాతంత్రం అందరికీ ఉండదు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఇలియానా బికినీ ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలియానా బికినీ ఫోటో మీద మీరు కూడా ఒక కన్నేయండి మరి.

Also Read:  Bindu Madhavi Pics: బుక్ పట్టిన బిందు మాధవి.. అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?

Also Read: బ్రా లేకుండా ప్రియాంక చోప్రా.. శారీ ఉన్నా లేనట్టే! పిచ్చెక్కిస్తున్న హాట్ డాన్స్ వీడియో 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News