Ileana D'Cruz's Health Condition: ఆస్పత్రిలో ఇలియానా.. ఐవి ఫ్లూయిడ్స్‌తోనే చికిత్స

Ileana D'Cruz's Health Condition: ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మూడు ఫోటోలు పోస్ట్ చేసి ఆ మూడు ఫోటోల కింద తన తాజా పరిస్థితిని ఒక్క ముక్కలో వివరించింది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి తన యోగక్షేమాల గురించి ఆరా తీసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఇలియానా.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 08:35 PM IST
Ileana D'Cruz's Health Condition: ఆస్పత్రిలో ఇలియానా.. ఐవి ఫ్లూయిడ్స్‌తోనే చికిత్స

Ileana D'Cruz's Health Condition: ఇలియానా డిక్రజ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆస్పత్రిలో చేరిన ఇలియానా తాజాగా సోషల్ మీడియా ద్వారా తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం రోజుకు మూడు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని.. మంచి వైద్యులు అందిస్తున్న చికిత్స కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని ఇలియానా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. 

ఇలియానా తన సోషల్ మీడియా పోస్టులో మూడు ఫోటోలు పోస్ట్ చేసి ఆ మూడు ఫోటోల కింద తన తాజా పరిస్థితిని ఒక్క ముక్కలో వివరించింది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి తన యోగక్షేమాల గురించి ఆరా తీసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఇలియానా.. ప్రస్తుతం తాను పూర్తి క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తపడమని అభిమానులకు సూచించింది. ఇక తన ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇలియానా స్పష్టంచేసింది.

2017 లోనే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్‌తో బాధపడినట్టు వెల్లడించిన ఇలియానా డిక్రజ్.. దాదాపు సూసైడ్ చేసుకోవాలన్నంత ఆలోచనల వరకు వెళ్లి వచ్చినట్టు చెప్పుకుని ఆందోళన వ్యక్తంచేసింది. జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి.. పోతుంటాయి.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలి కానీ అధైర్యపడకూదంటూ అప్పట్లోనే అభిమానులకు తాను ఎదుర్కొంటున్న క్లిష్టమైన దశ గురించి చెప్పుకొచ్చింది. 

ఇలియానా డిక్రజ్ సినిమా కెరీర్ విషయానికొస్తే.. దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు బిజీ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ సన్నని నడుం స్లిమ్ బ్యూటీ ఆ తరువాత దక్షిణాదిన అవకాశాలు తగ్గడంతో హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ ముంబైకి మకాం మార్చింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన బర్ఫి సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులే దక్కాయి కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.

ఇది కూడా చదవండి : Keerthy Suresh: దసరా టీజర్లో కీర్తి సురేష్ లేదేంటి? అసలేమైందబ్బా?

ఇది కూడా చదవండి : Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News