Tiger Nageswara Rao: 'టైగర్‌ నాగేశ్వరరావు' నుంచి బ్యూటీఫుల్ మెలోడీ వచ్చేసింది..!

Tiger Nageswara Rao: రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' నుంటి మరో బ్యూటిపుల్ మెలోడి సాంగ్ ఆడియెన్స్  ముందుకు వచ్చింది. ఈ సాంగ్ లో రవితేజ, గాయత్రి భరద్వాజ్‌ల కెమిస్ట్రీ అదిరింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 03:34 PM IST
Tiger Nageswara Rao:  'టైగర్‌ నాగేశ్వరరావు' నుంచి బ్యూటీఫుల్ మెలోడీ వచ్చేసింది..!

Tiger Nageswara Rao Songs: మాస్ మహారాజా రవితేజ నయా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. పాన్ ఇండియాల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి యువ దర్శకుడు వంశీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇండియాలో అతి పెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇందులో రవితేజకు జోడిగా కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ నటించింది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. 

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైనగ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇచ్చేసుకుంటాలే’ (Icchesukuntaale Song) అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాశ్ స్వరాలు అందించగా.. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. సింధూరి అలపించిన ఈ పాటలో  రవితేజ, గాయత్రి భరద్వాజ్‌ల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయంది. ఈ పాట విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఆర్‌ మదీ ఐఎస్‌సి పని చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News