AP Ticket Rates: ఏపీ సినిమా టికెట్ల ధరపై స్పందించిన ప్రభాస్.. ఏమన్నారంటే!!

Prabhas reacts on AP Tickets Rates issue. రాధేశ్యామ్ సినిమా విడుద‌ల‌కు ముందే ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెరిగితే సంతోష‌మే అని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 05:28 PM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • ఏపీ సినిమా టికెట్ల ధరపై స్పందించిన ప్రభాస్
  • టికెట్ల ధ‌ర‌లు పెరిగితే సంతోష‌మే
AP Ticket Rates: ఏపీ సినిమా టికెట్ల ధరపై స్పందించిన ప్రభాస్.. ఏమన్నారంటే!!

Prabhas reacts on AP Tickets Rates issue: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, గ్లామర్ బ్యూటీ పూజా హగ్డే హీరోహీరోయిన్‌లుగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 70ల కాలంనాటి ప్రేమకథతో రూపొందింది. ప్రభాస్‌ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా వైరస్ కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్‌.. మార్చి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉంది.  

సోమవారం రాధేశ్యామ్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌, హీరో ప్రభాస్‌ తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఏపీ సినిమా డిస్ట్రిబ్యూటర్లంతా రాధేశ్యామ్‌ సినిమాతోనైనా టికెట్‌ ధరలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నారు? మీరు ఏమంటారు సర్ అని అడగ్గా.. 'రాధేశ్యామ్ సినిమా విడుదలకంటే ముందే టికెట్ ధరలు పెరిగితే సంతోషిస్తా. ఏపీ సీఎంతో సమావేశంపై నిర్ణయాలు మా నిర్మాతలకే తెలుసు. ప్రభుత్వం తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. ఏపీలో పంపిణీ దారులు, ప్రదర్శన కారులంతా ఈ సినిమావైపే చూస్తున్నారు. అందరికి శుభవార్త అందాలని కోరుకుంటున్నా' అని ప్రభాస్‌ అన్నారు. 

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మాట‌లను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన చిత్రం 'భీమ్లా నాయ‌క్' విడుద‌ల సమయంలో కూడా ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల‌ను పెంచలేదు. సినిమా హాళ్ల వ‌ద్ద అధిక ధ‌ర‌లు అమ‌లు కాకుండా అధికారులతో పాటుగా పోలీసులను కూడా మెహరించింది. మరి  రాధేశ్యామ్ సినిమా విడుదల సమయానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

'దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ నా పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా ఆకట్టుకుంది. హస్తసాముద్రికా నిపుణుడిగా నటించడం థ్రిల్‌ అనిపించి ఈ కథను ఒకే చేశా. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించాలనేది నా కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా ఉంటారు. త్వరలోనే ఓ కామెడీ చిత్రంలో నటిస్తున్నా. ఆవివరాలు ఇప్పుడు చెప్పలేను' అని హీరో ప్రభాస్‌ చెప్పుకొచ్చారు. 

Also Read: INDW vs PAKW: వైరల్ వీడియో.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ కుమార్తెతో భారత ఆటగాళ్ల సందడి!!

Also Read: Movie Director Arrest: అత్యాచార కేసులో సినీ దర్శకుడి అరెస్ట్... పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News