Adipurush Controversy: నెలసరి మహిళలు ఆదిపురుష్ చూడొచ్చా ? బాబు గోగినేని సెటైర్లు

Adipurush Controversy: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ అప్పుడే పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. విశేషమేమంటే ఆస్థికులు, నాస్తికులు ఇరువురూ ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2023, 09:47 AM IST
Adipurush Controversy: నెలసరి మహిళలు ఆదిపురుష్ చూడొచ్చా ? బాబు గోగినేని సెటైర్లు

Adipurush Controversy: ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో, కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్రలో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ విడుదలకు సిద్ధమైంది. విడుదల కాకుండానే సినిమా చుట్టూ వివాదాలు వస్తున్నాయి. కొత్తగా బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆదిపురుష్ సినిమా ప్రారంభం నుంచీ వివాదాలే. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ విడుదలతో సినిమాకు చాలా హైప్ వచ్చేసింది. అదే సమయంలో భారీగా విమర్శలు ప్రారంభమయ్యాయి. రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాలో ఆధ్యాత్మిక భావన లోపించిందని..భక్తి పారవశ్యం కలిగే పరిస్థితి కన్పించడం లేదని సినీ విమర్శకులు కొత్త వాదన ప్రారంభించారు. ప్రభాస్ లో రాముడిని చూడలేకపోతున్నామని కొందరు విమర్శిస్తుంటే..మరికొందరు సీత పాత్రలో కృతిసనన్ ఎంపిక సరైంది కాదంటున్నారు.

తాజాగా ప్రముఖ హ్యూమన్ యాక్టివిస్ట్, నాస్తికుడైన బాబు గోగినేని ఈ చిత్రంపై వివాదాస్పద, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటా హనుమంతుడు వస్తాడనేది హిందూవుల నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగానే ప్రతి థియేటర్‌లో ఒక సీటు కేటాయిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపైనే బాబు గోగినేని తీవ్ర విమర్శలు చేశారు. 

సినిమా హాలుని గుడిగా మార్చేస్తున్నారా, మీకు అనుమతి ఉందా లేదా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు కొబ్బరికాయలు కొట్టే ఏర్పాట్లు కూడా చేస్తారా ఏంటని ప్రశ్నించారు. బహిష్టులో ఉన్న మహిళలు ఆదిపురుష్ సినిమా చూడవచ్చా అంటూ విమర్శలు కొనసాగించారు. పర మతస్థులు ఈ సినిమా చూడాలంటే రిజిస్టర్‌లో సంతకం చేయాలేమోనన్నారు. అదే విధగా ప్రతి థియేటర్‌లో పాప్‌కార్న్, సమోసాకు బదులుగా ప్రసాదం, అన్నదానం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. ప్రతి థియేటర్‌కు ఓ పూజారి, ఓ హుండీ ఏర్పాటు చేయాలన్నారు. రాహుకాలంలో సినిమా ప్రారంభమైతే పరిస్థితి ఏంటని..సినిమా ప్రదర్శించడం ఆపేస్తారా అని ప్రశ్నించారు.

సినిమా హాలుని థియేటర్‌గా మార్చేసినప్పుడు చెప్పుల్లేకుండా లోపలకి ప్రవేశించే నియమం పెట్టారా లేదా అని వ్యంగ్యాస్తం సంధించారు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకునేందుకు దిక్చూచి అమర్చారా లేదా అని బాబు గోగినేని సెటైర్ విసిరారు. ప్రతి థియేటర్‌లో చిప్స్, పాప్‌కార్న్ అమ్మవచ్చా లేదా, అమ్మేవాళ్ల మతం, కులం వివరాలు తెలుసుకున్నారా అని బాబు గోగినేని ప్రశ్నించారు. 

జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఆదిపురుష్ సినిమాపై బాబు గోగినేని వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో, భక్తులు ఎలా తీసుకుంటారో చూడాలి. 

Also read: Heroines Remunerations: హీరోయిన్స్‌లో తొలిసారిగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంది ఎవరో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News