Kalki Collectons: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ మూవీ ఫస్ట్ డే పలు రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు మొదటి వారంలోనే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపింది. ఇప్పటికే కల్కి సినిమా తెలంగాణలో రూ. 75 కోట్ల షేర్ (రూ. 150 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సీడెడ్ మరియు మిగిలిన ఏపీలో కలిపి దాదాపు రూ. 75 కోట్ల షేర్ (రూ. 150 కోట్ల గ్రాస్)
వరకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల షేర్ (రూ. 300 కోట్ల గ్రాస్) వసూళ్లతో దుమ్ము దులుపుతోంది.
మొత్తంగా కర్ణాటకలో దాదాపు రూ. 28 కోట్ల షేర్ (55 కోట్ల గ్రాస్).. తమిళనాడులో రూ 16 కోట్ల షేర్ (రూ. 30 కోట్ల గ్రాస్), కేరళలో రూ. 9 కోట్ల షేర్ (రూ. 20 కోట్ల గ్రాస్) హిందీలో నెట్ వసూళ్లు మన దేశంలో రూ. 84.40 కోట్లు (రూ. 170 కోట్ల గ్రాస్), ఓవర్సీస్ లో రూ. 100 కోట్ల షేర్ (రూ. 195 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలతో పాటు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 387.4 కోట్ల షేర్ (రూ. 770 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ రోజుతో ఈ సినిమా రూ. 800 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం ఖాయం. అంతేకాదు ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గడంతో ఈ శనివారం, ఆదివారాలు ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అది ఎంత మేరకు అన్నది చూడాలి. మొత్తంగా ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేయడం మాత్రం గ్యారంటీ.
ఇప్పికే తెలుగులో ఈ సినిమా రూ. 248 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలో దిగి రూ. 300 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 8 రోజుల్లో రూ. 387.4 కోట్లు రాబట్టింది. మొత్తంగా 8 రోజుల్లో 17 కోట్ల లాభాలను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ప్రభాస్ సినిమా ఇదే కావడం విశేషం.
సలార్ మూవీ చేసిన బిజినెస్ కు రూ. 10 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఒక రకంగా బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు దక్కిన క్లీన్ హిట్ గా కల్కి నిలిచింది. మరి టోటల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.
Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook