Hollywood Offer: జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో క్రిస్ హేమ్స్‌వర్త్, ఎక్స్‌ట్రాక్షన్ 3లో కలిసి నటిస్తారా

Hollywood Offer: టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హాలీవుడ్ ఆఫర్లు లభిస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ దిగ్గజ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ ఆర్ఆర్ఆర్ నటుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. చెర్రీ, జూనియర్‌లతో కలిసి పనిచేయాలనుందన్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2023, 03:20 PM IST
Hollywood Offer: జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో క్రిస్ హేమ్స్‌వర్త్, ఎక్స్‌ట్రాక్షన్ 3లో కలిసి నటిస్తారా

Hollywood Offer: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆస్కార్ గెల్చుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇంకా ప్రశంసలు  కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచంలో సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ కీర్తించాడు. సినిమాలో ప్రధాన నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించాడు. క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన ఎక్స్‌‌ట్రాక్షన్ 2 త్వరలో  స్ట్రీమింగ్ కానుంది. 2020లో విడుదలైన ఎక్స్‌ట్రాక్షన్‌కు ఇది సీక్వెల్. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన హేమ్స్‌వర్త్ ..జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పనిచేసే అవకాశమొస్తే గర్వకారణమన్నాడు.

క్రిస్ హేమ్స్‌వర్త్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కలిసి నటించిన సినిమా ఎక్స్‌ట్రాక్షన్. ఈ సినిమా ఎక్కువ భాగం ఇండియాలోనే షూట్ అయింది. ఇండియా అంటే ఇష్టపడే ఈ నటుడు తన కూతురి పేరు కూడా ఇండియా అని పెట్టుకోవడం విశేషం. ఎక్స్‌ట్రాక్షన్ 3 కూడా భారతదేశ నటులతోనే ఉంటుందన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే చూశానని..రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించాడు. ఆ ఇద్దరితో కలిసి పనిచేసే అవకాశమొస్తే అంతకంటే ఆనందించేది ఉండదన్నాడు. 

ఎక్స్‌ట్రాక్షన్ 2

జూన్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌ట్రాక్షన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇదొక విభిన్న కధాంశంతో కూడిన సినిమా. జార్జియన్ గ్యాంగ్‌స్టర్ బారిన పడిన కుటుంబాన్ని రక్షించే కథ ఇది. ఈ సినిమా మొదటి భాగం అతడి కుమారుడి మరణంతో ముగుస్తుంది. మొదటిభాగంలో ఇండియన్ నటులు రుద్రాక్ష జైశ్వాల్, రణదీప్ హుడా, పంకజ్ త్రిపాఠి, ప్రియాన్షు పైన్యూలి నటించారు. ఈ సినిమా 2020 ఏప్రిల్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ నటులు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఇద్దరు విప్లవ వీరులకు చెందిన ఫిక్షన్ స్టోరీ ఇది. ఇండియా బ్రిటీషు పాలనను వ్యతిరేకించిన కాలంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ అద్భుతంగా జీవించారు. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో ఆస్కార్ 2023 అవార్డు గెల్చుకుంది.

Also read: Punch Prasad Health: జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు అండగా ఏపీ సీఎంఓ.. వైరల్ అవుతున్న ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News