Heroine Poorna Pregnant వెండితెర, బుల్లితెరపై నటి పూర్ణకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. 2022లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. మొత్తానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతోన్నట్టుగా ప్రకటించింది. దుబాయ్‌లోని వ్యాపారవేత్తను పూర్ణ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను గర్భవతిని, తల్లిని కాబోతోన్నట్టు ప్రకటించింది. పూర్ణ ఫ్యామిలీ మొత్తం కూడా దుబాయ్‌లోనే సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆమె భర్త కూడా దుబాయ్‌లో పెద్ద వ్యాపారవేత్త.
పూర్ణ ఎంగేజ్మెంట్ రహస్యంగానే జరిగింది. ఆ తరువాతే ఆ నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి. తాను షనీష్ ఆసిఫ్ అలీని వివాహాం చేసుకోబోతోన్నట్టు, ఎంగేజ్మెంట్ జరిగిందంటూ పూర్ణ పోస్ట్ వేసింది. అయితే మధ్యలో ఈ ఇద్దరూ విడిపోయారంటూ గాసిప్స్ వచ్చాయి. నిశ్చితార్థం జరిగి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. విడిపోయారా? అంటూ రూమర్లు వచ్చాయి.
కానీ పూర్ణ మాత్రం దుబాయ్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టుగా పూర్ణ ప్రకటించింది. మొత్తానికి ఇప్పుడు తాను తల్లి కాబోతోన్నట్టు పూర్ణ ప్రకటించింది. పూర్ణ తల్లి కాబోతోండటంతోనే బుల్లితెరకు దూరంగా ఉందని అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ఆమె ఏ షోలోనూ కనిపించడం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ వంటి షోలకు పూర్ణ దూరంగా ఉండటం వెనుక అసలే కారణం ఇదే అన్న మాట.
అవును సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మాత్రం సరైన గుర్తింపు రాలేదు. చివరగా అఖండ సినిమాలో మంచి పాత్రను దక్కించుకుంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టినట్టు అయింది. అయితే ఇప్పుడు పూర్ణ సైడ్ కారెక్టర్లకు మంచి ఆప్షన్‌గా దర్శక నిర్మాతలకు నిలుస్తోంది.
Also Read: Dil Raju Shock: 'మైత్రీ'కి మరో షాకిచ్చిన దిల్ రాజు.. త్యాగమూర్తిని కాదంటూ కామెంట్స్!
Also Read: Prabhas on Kriti Sanon: కృతితో రిలేషన్ పై ఓపెన్ అయిపోయిన ప్రభాస్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి