Hero Vishal Injured: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హీరో విశాల్.. చేతి ఎముక ఫ్రాక్చర్

Hero Vishal Injured: తమిళ మాస్ హీరో విశాల్ 'లాఠీ' సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో విశాల్‌కు గాయాలయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 10:34 AM IST
  • తమిళ హీరో విశాల్‌కు గాయాలు
  • లాఠీ సినిమా షూట్‌లో గాయపడ్డ హీరో
  • చికిత్స నిమిత్తం కేరళకు విశాల్
Hero Vishal Injured: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హీరో విశాల్.. చేతి ఎముక ఫ్రాక్చర్

Hero Vishal Injured: తమిళ హీరో విశాల్ 'లాఠీ' సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన చేతి ఎముకతో పాటు కాలికి ఫ్రాక్చర్స్‌కి అయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన విశాల్.. చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. షూటింగ్‌లో గాయపడిన వీడియోను విశాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఓ భవనంలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా విశాల్ గాయపడటం ఆ వీడియోలో గమనించవచ్చు. వెనకాల రౌడీ మూకలు తరుముతుండగా.. చేతిలో పిల్లవాన్ని ఎత్తుకుని విశాల్ కిందకు జంప్ చేశాడు. ఈ క్రమంలోనే విశాల్‌కి గాయాలయ్యాయి. 'లాఠీ సినిమా షూటింగ్‌లో భాగంగా స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గాయపడ్డాను. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. గాయాల నుంచి కోలుకునేందుకు కేరళ వెళ్తున్నాను. సినిమా చివరి షెడ్యూల్‌ కోసం మార్చి మొదటి వారంలో మళ్లీ చిత్ర యూనిట్‌తో జాయిన్ అవుతాను.' అని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విశాల్ త్వరగా  కోలుకోవాలని అతని అభిమానులు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో విశాల్ చేతిలో ఉన్న ఆ పిల్లవాడు బాగానే ఉన్నాడా అని ఆరా తీస్తున్నారు. కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'లాఠీ' సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. విశాల్‌కి జోడీగా సునయన నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 4న విశాల్ నటించిన 'వీరమయి వాగై సూదుమ్' ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సత్తా చాటలేకపోయింది. దీంతో విశాల్ తన తదుపరి సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.

Also Read: AP New Districts: మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు... ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News