Prabhas Gift: ఫిట్నెస్ ట్రైనర్ కు అంత ఖరీదైన బహుమతి ఎందుకంటే

శారీరకంగానే కాదు విశాల మనస్సులో కూడా బాహుబలి అన్పించుకున్నాడు యంగ్ రెబెల్ ప్రభాస్. ఫిట్నెస్ ట్రైనర్ కు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు.

Last Updated : Sep 5, 2020, 06:09 PM IST
Prabhas Gift: ఫిట్నెస్ ట్రైనర్ కు అంత ఖరీదైన బహుమతి ఎందుకంటే

శారీరకంగానే కాదు విశాల మనస్సులో కూడా బాహుబలి ( Bahubali ) అన్పించుకున్నాడు యంగ్ రెబెల్ ప్రభాస్ ( Young rebel prabhas ) . ఫిట్నెస్ ట్రైనర్ కు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు.

సినీ పరిశ్రమలో హీరోలు ఇప్పుడు ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ ( Physical Fitness ) పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉండేందుకు ఎక్కువ సమయం జిమ్ లలో గడుతున్నారు. ఫిట్నెస్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. బాహుబలి ప్రభాస్ కు సైతం ఓ ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నాడు. అతని పేరు లక్ష్మణ్ రెడ్డి. ఇప్పుడితను హఠాత్తుగా ఎందుకు వార్తలకెక్కాడంటే...ప్రభాస్ చేసిన పని అలాంటిది మరి. తన ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి అందరూ నోరెళ్లబెట్టేలా చేశాడు ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ అతనికిచ్చిన గిఫ్ట్ ఆషామాషీ గిఫ్ట్ కాదు. లక్షల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు ( Range Rover car ) మరి. ప్రభాస్ తన ఫిట్నెస్ ట్రైనర్ కు ఇచ్చిన రేంజ్ రోవర్ కారు  గిఫ్ట్ విషయమే ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రభాస్ కు కొత్తేమీ కాదు. నచ్చితే...ఇలాగే ఆశ్చర్యపోయే బహుమతుల్ని గతంలోనూ కొందరికి ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. Also read: Sushant singh Case: ముంబై పోలీసులు ఏం దాచిపెడుతున్నారు?

Trending News