Hero Nihal Vijayanand : అల్లు అర్జున్ ఫ్యాన్‌ని.. నేర్చుకున్న తెలుగు పదం అదే.. హీరో నిహాల్

Hero Nihal on Allu Arjun అల్లు అర్జున్ ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ అంతకంటే ముందే కేరళ, కన్నడలో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. దానికి ఉదాహరణే తాజాగా నిహాల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 02:43 PM IST
  • డిసెంబర్ 9న రాబోతోన్న విజయానంద్
  • బన్నీ మీద కన్నడ హీరో కామెంట్స్
  • నేర్చుకున్న మొదటి తెలుగు పదం అదేనట
Hero Nihal Vijayanand : అల్లు అర్జున్ ఫ్యాన్‌ని.. నేర్చుకున్న తెలుగు పదం అదే.. హీరో నిహాల్

Hero Nihal on Allu Arjun ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. కేజీయఫ్‌, కాంతారాలో కన్నడ పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తి అయింది. ఇప్పుడు కన్నడ పరిశ్రమలో మొట్టమొదటి సారిగా ఓ బయోపిక్ రాబోతోంది. ట్రాన్స్‌పోర్ట, లాజిస్టిక్ రంగంలో ఎంతోఎత్తుకు ఎదిగిన విజయ్ సంకేశ్వర్ జీవిత చరిత్ర ఆధారంగా విజయానంద్ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాను ఆనంద్ సంకేశ్వర్ నిర్మిస్తుండగా.. రిషిక శర్మ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో విజయానంద్ పాత్రలో నిహాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ మేరకు హైద్రాబాద్‌లో ఈ చిత్రయూనిట్‌ మీడియాతో ముచ్చటించింది. విజయానంద్ టీం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో నిహాల్ మాట్లాడుతూ.. 'నాకు తెలుగులో అల్లు అర్జున్ అంటే ఇష్టం. నేను నేర్చుకున్న తెలుగు పదం.. నా పేరు ఆర్య. తెలుగు సినిమాలో ఎంత స్టైల్ ఉంటుంది. మహేష్‌ బాబు గారి పోకిరి చిత్రం నాకు ఇష్టం. తండ్రీకొడుకులైన విజయ్ సంకేశ్వర్, ఆనంద్ సంకేశ్వర్‌ల కాంబినేషన్ ఈ సినిమా. పద్మశ్రీ విజయ్ సంకేశ్వర్ గురించి చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాను.

బస్ టికెట్ బుక్ చేయాలంటే వీఆర్ఎల్‌లోనే బుక్ చేయమని అడుగుతుంటారు. 2019లో ట్రంక్ అనే సినిమాను 19 లక్షల్లో నేను, రిశికా శర్మ ఓ సినిమా తీశాం. ఆ తరువాత మేం ఓ బయోపిక్ తీయాలని అనుకున్నాం. దాని కోసం చాలా హోం వర్క్ చేశాం. ఆ తరువాత విజయ్ సర్‌ను కలిశాం. మీ మీద ఓ సినిమా తీయాలని అనుకుంటున్నామని చెప్పాను. నేనేమీ సాధించలేదు.. నా మీద ఎందుకు అని అన్నారు. పదిహేను నిమిషాలు టైం అడిగితే.. ఏడెనిమిది గంటల పాటు మాతో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి మాకు వంద గంటల పాటుగా ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సినిమాను 98 రోజులు షూట్ చేశాం. అందులో ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశామ'ని అన్నారు.

ఆనంద్ సంకేశ్వర్ మాట్లాడుతూ.. 'మా నాన్న గారి జర్నీ 1950లో మొదలైంది. మా తాత గారికి పబ్లికేషన్ ప్రెస్ ఉంది. మా అంకుల్స్ ఇంకా దాన్ని నడిపిస్తున్నారు. అందరం ఇదే వ్యాపారం ఎందుకు అనే ఆలోచన మా నాన్నకు వచ్చింది. అందుకే ఈ ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీలోకి వచ్చారు. 76లో ఒక ట్రక్కుతో ప్రయాణం మొదలైంది.. ఇప్పుడు ఐదువేలకు చేరింది. ఇంకో పదహారు వందల ట్రక్కులను కూడా మేం ఆర్డర్ చేశాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మా బ్రాంచ్‌లున్నాయి. దేశవ్యాప్తంగా పదిహేను వందల బ్రాంచ్‌లున్నాయి. రిషిక, నిహాల్ మా నాన్నను ఓ అరగంట టైం అడిగారు. కానీ ఎనిమిది, తొమ్మిది గంటలు సాగింది. ఆ తరువాత మా నాన్న నాకు ఫోన్ చేశారు. సినిమా గురించి అభిప్రాయం అడిగారు. సరే చేసేద్దామని అన్నారు. అలా మా వీఆర్‌ఎల్ ప్రొడక్షన్స్ ప్రారంభించాం. ఇక ముందు మంచి చిత్రాలను నిర్మిస్తూనే ఉంటామ'ని అన్నారు.

Also Read : Chiranjeevi Waltair Veerayya : విదేశాలకు వీరయ్య.. హీరోయిన్‌తో మెగాస్టార్ రొమాన్స్

Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News