Hemachandra and Sravana Bhargavi Responds on rumors: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ జంట హేమచంద్ర-శ్రావణ భార్గవి విడాకులు తీసుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద వీరు వ్యూహాత్మక మౌనం పాటించడంతో ఇక విడాకులు ఖాయమని ఇప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కూడా వారు స్పందించకపోవడంతో ఇది నిజమేనని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విడాకులు వార్తల మీద హేమచంద్ర, శ్రావణ భార్గవి ఏకకాలంలో స్పందించారు. శ్రావణ భార్గవి, హేమచంద్ర తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్టులు పెట్టారు.
శ్రావణ భార్గవి షేర్ చేసిన పోస్ట్ ప్రకారం కొద్దిరోజులుగా తన యూట్యూబ్ వ్యూస్ బాగా పెరిగాయని, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారని ఆమె చెప్పుకొచ్చారు. తాను చేసే పని కంటే ఇప్పుడు ఎక్కువ పని లభిస్తోందని, అలాగే గతంలో తాను సంపాదించే దానికంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సంపాదించే అవకాశం దొరికిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇది ఒక శుభ పరిణామమే పేర్కొన్న ఆమె తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం అంటూ ఇది నా రాండం థాట్ అంటూ ఆమె షేర్ చేసి అందులో హేమచంద్ర ను టాగ్ చేసింది.
ఇక హేమచంద్ర అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ ఒక పోస్టును రివర్స్ లో షేర్ చేసి ఎవరైతే తమ సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారో, తమ స్టుపిడ్ బయటపెట్టాలి అనుకుంటున్నారో వారికోసమే ఈ పోస్టు అంటూ ఆయన పేర్కొన్నారు. అవసరం లేని సంబంధంలేని సమాచారం మాత్రం, నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే తన ఇంస్టాగ్రామ్ బయోలో తన ఇండిపెండెంట్ సాంగ్ లవ్ ఉంది దాన్ని వీక్షించండి అంటూ ఆయన పేర్కొన్నారు.
అయితే ఒక పక్క శ్రావణ భార్గవి పాజిటివ్ నెగిటివ్ వార్తలు ఏవైనా కానీ తనకు ఉపయోగపడ్డాయని పేర్కొంటే హేమచంద్ర అవసరం లేని సమాచారం ఫాస్ట్గా షేర్ అవుతోంది తన వీడియో సాంగ్స్ కూడా చూడమని కోరాడు. కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా తమ విడాకుల వ్యవహారాన్ని ఖండించక పోవడం గమనార్హం. అయితే శ్రావణ భార్గవి షేర్ చేసిన పోస్టులకు కామెంట్లు డిజేబుల్ చేయగా హేమచంద్ర పోస్టులకు మాత్రం కామెంట్లు వస్తున్నాయి. ఇందులో ఈ పుకార్లు పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కామెంట్లను, యూట్యూబ్ కామెంట్లను ఆఫ్ చేసిందని దీంతో ఈ పుకార్లు మరింత వ్యాప్తి చెందాయని ఇప్పటికీ ఖండించకుండా ఉండడం ఏదో తేడాగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి