Hema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు

Bangalore Reva Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ రేవ్ పార్టీ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు హేమ. తాను ఆ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో క్లిప్ సైతం విడుదల చేసింది.. అయితే ఆమెకు బెంగళూరు పోలీసులు షాక్ పైన షాక్ ఇస్తున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 23, 2024, 01:31 PM IST
Hema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు

Hema Gets Positive in Drugs Test: తెలుగు సినీనటి హేమను.. బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో పట్టుకున్నారని మే 21వ తేదీన.. బెంగళూరు మీడియా ఛానల్స్ లో ప్రసారం అయ్యింది. కానీ వెంటనే హేమ యూట్యూబ్ లో ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో తాన అసలు రేవ్ పార్టీకి అటెండ్ అవ్వలేదని.. తాను హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది. 

అయితే బెంగళూరు పోలీసులు వెంటనే హేమా రేవ్ పార్టీలో ఉన్న ఫోటోని విడుదల చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా బెంగళూరు పోలీసులు విరుదల చేసిన ఫోటోల్లో ఉన్న హేమా.. అలానే హేమ  తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ విడుదల చేసిన వీడియోలోని డ్రెస్ ఒకటే కావటం గమనర్హం. దాంతో హేమా అని అబద్ధాలు చెబుతోందని.. తాను రేవ్ పార్టీకి అటెండ్ అయ్యిందని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చాయి. ఇక బెంగళూరు పోలీసుల ఫోటో వల్ల.. ప్రూఫ్ కూడా ఉండడంతో.. హేమా ఆ తరువాత ఈ విషయంపై పెద్దగా స్పందించలేకపోయింది.

అయితే ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకువచ్చాయి.  పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చెయ్యగా, అందులో 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆశీ రాయ్, పార్టీ నిర్వహించిన వాసు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపించమన్నారు.

ఇక దీంతో హేమా డ్రగ్స్ తీసుకుందన్న విషయం సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై హేమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

కాగా హేమ ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ముఖ్యంగా హేమ బ్రహ్మానంద్ భార్యగా చేసిన సినిమాలు మంచి కామెడీ ని పంపించాయి. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈ నటికీ..ప్రస్తుతం మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.

Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News