Guntur Kaaram Movie: మహేశ్‌ బర్త్‌డే ట్రీట్ అదిరింది... మాస్‌ లుక్‌లో సూపర్ స్టార్..

HBD Mahesh Babu: మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గుంటూరు కారం’. బుధవారం మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2023, 08:42 AM IST
Guntur Kaaram Movie: మహేశ్‌ బర్త్‌డే ట్రీట్ అదిరింది... మాస్‌ లుక్‌లో సూపర్ స్టార్..

Guntur Kaaram Movie Update: ఇవాళ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu)  బర్త్ డే. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'(Guntur Kaaram). త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మహేశ్ పుట్టిన రోజు(Mahesh Babu Birthday) సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో లుంగీలో కూర్చొని ఓ చేతిలో అగ్గిపెట్ట, మరో చేతితో సిగరెట్‌ను వెలిగిస్తూ మహేశ్ కనిపిస్తారు. ఈ మాస్ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా తాజా పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎస్ ఎస్ థమన్ తప్పుకుంటున్నారని వస్తున్న వార్తలపై కూడా పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టతనిచ్చారు. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలిపారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్‌ తప్పుకోగా.. ఈ సారి ఫైట్‌ మాస్టర్‌లు రామ్‌-లక్ష్మణ్‌లు కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ల స్థానంలో తమిళ ఫైట్‌ మాస్టర్‌లు అన్బరీవ్‌లు తీసుకున్నట్లు టాక్. ఈ విషయాలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు నటిస్తున్నారు. మహేశ్‌ పుట్టినరోజుకు కేవలం పోస్టర్‌ మాత్రమే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మూవీ నుంచి ఏదైనా లిరికల్‌ సాంగ్‌ లేదా గ్లింప్స్‌ రిలీజ్ చేసే ఉంటే బాగుండేదని వారు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Director Siddique dies: చిత్రసీమలో మరో విషాదం.. గుండెపోటుతో 'బాడీగార్డ్' డైరెక్టర్ కన్నుమూత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News