Harry Potter Actor : హ్యారీ పోటర్ నటుడు మృతి.. వెలుగులోకి రాని కారణాలు

Harry Potter Actor హ్యారీ పోటర్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) శుక్రవారం తుది శ్వాస విడిచాడు. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2022, 07:07 AM IST
  • హాలీవుడ్‌లో నెలకొన్న విషాదం
  • హ్యారీ పోటర్ నటుడు మృతి
  • రాబీ కోల్ట్రేన్ మరణ వార్తతో ఆందోళన
Harry Potter Actor : హ్యారీ పోటర్ నటుడు మృతి.. వెలుగులోకి రాని కారణాలు

Harry Potter Actor Robbie Coltrane Death : హ్యారీ పోటర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా హ్యారీ పోటర్ సినిమాను చిన్న పిల్లలు ఇష్టపడుతుంటారు. మంత్రదండంతో హీరో చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలా హ్యారీ పోటర్ కథకు, దాన్ని రాసిన జేకే రౌలింగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక హ్యారీ పోటర్ సినిమాలోని కొన్ని పాత్రలు అందరిపైనా ముద్ర వేస్తాయి. అందులో హ్యాగ్రిడ్ పాత్ర ఒకటి. ఆ కారెక్టర్‌ను పోషించిన స్కాటిష్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) శుక్రవారం నాడు కన్నుమూశారు. ఈ వార్తతో హాలీవుడ్‌లో విషాదం నెలకొన్నట్టు అయింది.

ప్రముఖ టీవీ సిరీస్ క్రాకర్‌లో నేరాలను పరిష్కరించే సైక్రియార్టిస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణ వార్తను ఏజెంట్ బెలిందా రైట్ అందరికీ తెలిసేలా చేసింది. శుక్రవారం నాడు స్కాట్లాండ్‌లోని ఆసుపత్రిలో మరణించినట్లు తెలిపారు. అయితే మరణానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. రాబీ మరణం పట్ల స్పందిస్తూ.. "అద్భుతమైన నటుడే కాకుండా.. అతను న్యాయపరంగా తెలివైనవాడు. ఎంతో చమత్కరిస్తుంటాడు. 40 సంవత్సరాల తర్వాత అతని ఏజెంట్ అని పిలవబడటం గర్వంగా ఉంది, నేను అతన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను." అని ఎమోషనల్ అయింది.

కోల్ట్రేన్‌కు అతని సోదరి అన్నీ రే, అతని మాజీ భార్య రోనా గెమ్మెల్, అతని పిల్లలు స్పెన్సర్ , ఆలిస్‌లు ఉన్నారు. రాబీ కోల్ట్రేన్ మొదటిసారిగా 1990లలో క్రాకర్‌లో హార్డ్-బిటెన్ డిటెక్టివ్‌గా ఫేమస్ అయ్యాడు. అతని నటనకు, బాఫ్టాలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

అతను జేకే రౌలింగ్ సృష్టి అయిన హ్యారీ పాటర్ సిరీస్‌లో హాగ్రిడ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. అతను 2001-2011 మధ్య విడుదలైన మొత్తం ఎనిమిది హ్యారీ పోటర్ చిత్రాలలో బాయ్ మాంత్రికుడికి గురువుగా, స్నేహితుడిగా వ్యవహరించే పాత్రలో కనిపించాడు. జేమ్స్ బాండ్ థ్రిల్లర్స్ గోల్డెన్ ఐ, ది వరల్డ్ ఈజ్‌లో రష్యన్ క్రైమ్ బాస్ ప్రాతల్లో కనిపించారు.

Also Read : Ponniyin Selvan Collection : సైలెంట్‌గా కలెక్షన్ల సునామీ

Also Read : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News