Harish Shankar Salman Khan: డేట్లు ఇచ్చే వరకూ కదిలేది లేదు.. సల్లూ భాయ్ డేట్ల కోసం భీష్మించుకు కూర్చున్న హరీష్ శంకర్?

Harish Shankar Waiting for Salman Khan: సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ కోసం హరీష్ శంకర్ ఒక ముంబై  స్టార్ హోటల్ లో ఎదురు చూస్తున్నారని, ఆయన గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చేవరకు కదిలేదు లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 3, 2022, 10:29 AM IST
Harish Shankar Salman Khan: డేట్లు ఇచ్చే వరకూ కదిలేది లేదు.. సల్లూ భాయ్ డేట్ల కోసం భీష్మించుకు కూర్చున్న హరీష్ శంకర్?

Harish Shankar at Mumbai Hotel: టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కలిసి ప్లాన్ చేసిన రామ్ చరణ్ 16వ సినిమా ఆగిపోయిందని తెలుస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా నిలిచిపోయిందని కొత్తగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇంత పెద్ద ఎత్తున ఆ విషయం మీద ఇప్పటి వరకు అటు దర్శకుడి నుంచి కానీ ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి కానీ సరైన క్లారిటీ అయితే లభించడం లేదు. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరు అలాగే హరీష్ శంకర్ ప్రస్తుతం ముంబైలో ఒక స్టార్ హోటల్లో బస చేశారని గత కొద్ది రోజులుగా ఆయన సల్మాన్ ఖాన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.ఆయన సల్మాన్ ఖాన్ కి ఒక సబ్జెక్ట్ చెప్పారని దానికి సల్మాన్ ఖాన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ఆయన ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

 తెలుగు హీరోలలో ప్రస్తుతం టైర్ 2, టైర్ 3 హీరోలు తప్ప టైర్ 1 హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. దాదాపు అందరికీ రెండు మూడు సినిమాల వరకు ఇప్పటికే డేట్లు బ్లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు హీరోతో సినిమా చేయడం కంటే ఒక బాలీవుడ్ హీరో తో తెలుగు డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా హరీష్ శంకర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యి సల్మాన్ ఖాన్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియదు కానీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. నిజానికి కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కు హరీష్ శంకర్ కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో హరీష్ శంకర్ కూడా సల్మాన్ ఖాన్ ను కలవడంతో దాదాపు ఈ వార్తలు నిజమేనని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. మరి చూడాలి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా అది ఎంతవరకు నిజమా అవ్వబోతుంది అనేది.

Also Read: Andrea Jeremiah Hot Photos: మైగాడ్ అనిపిస్తున్న ఆండ్రియా.. ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిందిగా!

Also Read: Samantha – Chaitanya’s meeting: హాస్పిటల్ కు చైతూ.. చూడగానే సమంత.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News