Harish Shankar : మాస్ మహారాజు రవితేజ భారీ విక్టరీని ఆశిస్తూ.. మిస్టర్ బచ్చన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆగస్టు 15న ఎన్నో అంచనాల.. మధ్య విడుదలైన ఈ చిత్రం.. ఎక్కువ విమర్శలకు గురి అవుతోంది. ముఖ్యంగా హరిష్ శంకర్ పై.. ఒక బ్యాచ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు..డబల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా కొట్టిన పూరిని.. కూడా ఇంతగా ఎవరు విమర్శించడం లేదు. సోషల్ మీడియా మొత్తం హరీష్ శంకర్ పైనే పూర్తిగా గురి పెట్టింది. గతంలో ఆయన మాట్లాడిన మాటలలో.. ఒక్కొక్కరు ఒక్కో క్లిప్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంత దారుణమైన.. సినిమాని సినీ హిస్టరీలోనే ఎవరు తీసి ఉండరు.. ఇంత వరస్ట్ గా రీమేక్ కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు.. అని ఓపెన్ గానే తిట్టేస్తున్నారు.
ఈ మూవీలో సీన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయో చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది.. అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో హీరో గుర్తొచ్చినప్పుడు.. హీరోయిన్ తన ఫ్రెండ్‌కు సిగరెట్ ఇచ్చి స్మోక్ చేయమని అడుగుతుంది. ఇక అందులో నుంచి వచ్చే పొగను..ఆస్వాదిస్తూ హీరోను తలచుకొని సంతృప్తి పడుతుంది. అసలు ఇలాంటి ఒక సీన్ తీయాలి.. అన్న థాట్ ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇలాంటి ఐడియాలు రావాలి అంటే ఎంతో మేధావి అయి ఉండాలి.. ఏమన్నా హరీష్ శంకర్ చాలా గ్రేట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఈ మూవీలో డైలాగ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ సినిమాలు అంటే మాస్ కంటెంట్‌తో పాటు సాలిడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి.. కానీ ఈ మూవీలో మాత్రం.. అసలు డైలాగ్స్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కావడం లేదు. ‘పెళ్లంటేనే పేకాట.. పేకాట లేకుండా పెళ్లి జరగదు.. ‘అని సత్య అంటే..’పెళ్లిలో పేకాట.. మరి పెళ్లి తరువాత’ అని మరో కమెడియన్ అడుగుతాడు. అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని డైరెక్టర్ ప్రేక్షకుల ఆలోచనకు.. వదిలేస్తాడు. ఈ కామెడీ సీన్ వచ్చినప్పుడు అసలు ఇది సినిమానా లేక జబర్దస్త్ షోనా అని డౌట్ వస్తుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమాలో ఒక డైలాగ్ మాత్రం హరీష్.. ఒక దర్శకుడికి పంచ్ ఇవ్వడానికి రాసుకున్నాడు అని కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుపుతున్నారు. అసలు విషయానికి వస్తే..ఈ మూవీలో ఒకచోట హీరో విలన్‌కి.. వార్నింగ్ ఇస్తూ వదిలిన డైలాగ్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించి రాసినది అని అందరూ భావిస్తున్నారు. ’నేను మాయలోడ్నే.. కానీ.. మాయల మాంత్రికుడ్ని కాదు.. మాటల మాంత్రికుడ్ని కాదు.. మ్యాటర్ ఉన్న మాంత్రికుడ్ని..’అని రవితేజ అన్నప్పుడు..ఇక్కడ మాటల మాంత్రికుడు అన్న పదాన్ని అందరూ త్రివిక్రమ్‌కి లింక్ చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ గురించి ఇక్కడ ఏ ఉద్దేశంతో హరీష్ శంకర్ ప్రస్తావించాడు.. ఎవరికి అర్థం కావడం లేదు. అంటే త్రివిక్రమ్ కేవలం మాటల మాంత్రికుడు.. నేను మేటర్ ఉన్న మాంత్రికుని అని హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో.. జోరుగా చర్చలు సాగుతున్నాయి. త్రివిక్రమ్ మీద హరీష్ శంకర్ వదిలిన ఈ పంచ్ డైలాగ్ వెనుక అర్థమేంటి? అసలు ఇందులో అలాంటి డైలాగ్ వేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు దీనికి త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారు?అనే విషయంపై అందరూ మాట్లాడుకుంటున్నారు.
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter