Pawan Kalyan Shoe Rate : హరి హర వీర మల్లు అప్డేట్.. పవన్ కళ్యాణ్ బూట్లపై చర్చ.. రేటు విషయంలో గందరగోళం

Hari Hara Veera Mallu Work Shop Video నిన్నంతా కూడా ట్రెండ్ అయింది. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 04:28 PM IST
  • మొదలెట్టేసిన హరి హర వీరమల్లు
  • పవన్ కళ్యాణ్ ఫోటోలపై చర్చ
  • పవర్ స్టార్ బూటు రేట్లపై గందరగోళం
Pawan Kalyan Shoe Rate : హరి హర వీర మల్లు అప్డేట్.. పవన్ కళ్యాణ్ బూట్లపై చర్చ.. రేటు విషయంలో గందరగోళం

Pawan Kalyan-Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా సన్నద్దంగా ఉంది. వర్క్ షాప్ ఫోటోలను చిత్రయూనిట్ రిలీజ్ చేయడంతో.. ట్విట్టర్ మోత మోగిపోయింది. ఈ మూవీ స్టిల్స్ కాకపోయినా కూడా వర్క్ షాప్ ఫోటోలే అయినా అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ లుక్కులోనే సినిమాలను తీసేయ్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక హరీష్ శంకర్‌కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్వీట్లు, ట్యాగులు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇదే లుక్కును ఫైనల్ చేసేయ్ అన్నా అని సలహాలు ఇస్తున్నారు.

కొంత మంది పవన్ కళ్యాణ్ ఫోటోలను చూసి మురిసిపోతోంటే.. ఇంకొందరు మాత్రం పవన్ కళ్యాణ్ బూట్లను చూశారు. ఆ బూట్ల రేట్ల మీద చర్చలు మొదలుపెట్టేశారు. ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ బూట్ల రేట్లను పది లక్షలు అని చెప్పుకొచ్చాడు. అయితే దాని రేటు అంత ఉండదని, ఇంకొందరు అంటున్నారు. దాని రేటు ఒకరేమో లక్ష అని అంటే.. ఇంకొకరు పది వేలు మాత్రమే అని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బూట్లు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పవర్ స్టార్ మాత్రం ఫుల్ స్టైలీష్ లుక్స్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక త్వరలోనే ఈ మూవీ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ మధ్య కూడా సీన్లు ఉండబోతోన్నట్టు తెలుస్తున్నాయి. అసలే హరి హర వీరమల్లు సినిమా మీద రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. ఈ చిత్రం ఆగిపోయిందని కొందరు కథనాలు అల్లేస్తుంటారు. సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని, వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ధీమాను నిర్మాత ఏ ఎం రత్నం వ్యక్తం చేశాడు.

హరి హర వీరమల్లు సినిమా తరువాత పవన్ కళ్యాణ్. . హరీష్ శంకర్ చిత్రం కూడా చేయాల్సి ఉంది. అంతకు ముంద సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది.

Also Read : డబ్బులు సంపాదించాలనే 'అల్లు స్టూడియోను కట్టారని అనుకోను..చిరంజీవి

Also Read :సింగర్ మంగ్లీ క్రేజ్‌కు నిదర్శనం.. అలా మోసిన అభిమానులు.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x